Begin typing your search above and press return to search.

ఆక్సిజన్ లేక అల్లాడుతుంటే ఐపీఎల్ కోసం వేల కోట్ల ఖర్చునా?

By:  Tupaki Desk   |   26 April 2021 3:30 PM GMT
ఆక్సిజన్ లేక అల్లాడుతుంటే ఐపీఎల్ కోసం వేల కోట్ల ఖర్చునా?
X
కరోనా వైరస్ తో దేశం అల్లకల్లోలం అవుతుంటే మరోవైపు ఐపీఎల్ కోసం ఫ్రాంచైజీలు, ప్రభుత్వాలు, కంపెనీలు వేల కోట్ల రూపాయలు ఎలా ఖర్చు పెడుతున్నాయని రాజస్థాన్ రాయల్స్ పేసర్, ఆస్ట్రేలియా క్రికెటర్ ఆండ్రూ టై ప్రశ్నించాడు. భారత్ లోని ఆస్పత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ దొరక్క ప్రజలు అల్లాడుతుంటే ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ఐపీఎల్ 2021 సీజన్ కొనసాగించడం సమంజసం కాదని ఆండ్రూ అన్నారు.

మెగా ఐపీఎల్ నిర్వహణ విషయంలో ఇతరుల అభిప్రాయాలను తాను గౌరవిస్తానని.. కానీ అందరూ ఒకేలా ఆలోచిస్తారని మాత్రం తాను అనుకోవడం లేదని అన్నారు. భారత్ లో ఐపీఎల్ కు ఉన్న క్రేజ్, కఠిన పరిస్థితుల్లో ఈ క్యాష్ రీచ్ లీగ్ ద్వారా ప్రజలకు అందిస్తున్న మానసిక ఉల్లాసాన్ని తాను అర్థం చేసుకోగలనని తెలిపాడు. క్రీడలతో మానసికోల్లాసం లభిస్తుందని.. ముఖ్యంగా కఠిన పరిస్తితుల్లో ప్రజలకు ఇదెంతో మేలు చేస్తుందన్నారు.

ఈ కారణంతోనే ఐపీఎల్ ను కొనసాగిస్తున్నారని.. కానీ అందరూ ఇదే అభిప్రాయంతో ఉంటారని మాత్రం నేను అనుకోవడం లేదని తెలిపారు. నేను అన్ని కోణాల్లో నుంచి అందరి అభిప్రాయాలను గౌరవిస్తానని ఆండ్రూ టై తెలిపారు.

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా ఉన్న నేపథ్యంలో ఆండ్రూ టై లీగ్ ను తప్పుకొని ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. అతడితోపాటు మరో ఇద్దరు అసీస్ ప్లేయర్లు ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్ సన్ కూడా వైదొలిగారు. ఆండ్రై టై ఈ సీజన్ లో రాజస్థాన్ తరుపున ఒక్క మ్యాచ్ ఆడలేదు. ఆస్ట్రేలియా వెళ్లి ఇప్పుడు ఐపీఎల్ పై కామెంట్ చేశాడు.