Begin typing your search above and press return to search.

ఆ వీడియో.. క‌మ్మ వ‌ర్సెస్ బీసీ వివాదంగా మారిందే..!

By:  Tupaki Desk   |   8 Aug 2022 2:39 AM GMT
ఆ వీడియో.. క‌మ్మ వ‌ర్సెస్ బీసీ వివాదంగా మారిందే..!
X
ఏం జ‌రిగినా కులాల కార్డులు తీస్తున్న రాజ‌కీయాలు క‌నిపిస్తున్నాయి. ఇటు  ప్ర‌భుత్వం తీసుకునే నిర్ణ‌యా లు అయినా.. రాజ‌కీయ పార్టీలు తీసుకునే నిర్ణ‌యాలు అయినా..ఇప్పుడు కులాల మ‌ధ్య అంత‌రాలు పెంచుతున్నాయి. ముఖ్యంగా క‌మ్మ వ‌ర్గాన్ని వైసీపీనేత‌లు.. టార్గెట్ చేశార‌నే వాద‌న ఉండ‌నే ఉంది. అమ‌రావ‌తి రాజ‌ధాని విష‌యంలో.. క‌మ్మ సామాజిక వ‌ర్గంపై వైసీపీ పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేసింది. ఈ వ‌ర్గానికి చెందిన వారికి రెండో ద‌ఫా మంత్రి ప‌ద‌వి కూడా లేకుండా చేసింద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి.

ఇక‌, స‌ర్కారు త‌ర‌ఫున‌.. ఏ అధికారిపైనైనా.. చ‌ర్య‌లు తీసుకుంటే.. ఇటు ప్ర‌తిప‌క్షాలు కూడా కులం కార్డును జోడించి.,. అదిగో ఆ సామాజిక వ‌ర్గం కాబ‌ట్టే చ‌ర్య‌లు తీసుకున్నార‌నే ప్ర‌చారం చేస్తున్నారు.

ఇలా.. రాష్ట్రం లో కులాల మ‌ధ్య చిచ్చు ర‌గులుతూనే ఉంది. ముఖ్యంగా బీసీల విష‌యంలో మ‌రింత‌గా రాజ‌కీయాలు సాగుతున్నాయి. బీసీల‌కు.. ఎస్సీ, ఎస్టీల‌కు ప‌ద‌వులు ఇచ్చామ‌ని.. వైసీపీ కులం కార్డు రాజ‌కీయాలు చేస్తే.. ఇచ్చారు కానీ.. వారికి అధికారాలు లేవ‌ని.. అంతా సీఎం ద‌గ్గ‌రే పెట్టుకున్నార‌ని టీడీపీ చెబుతోంది.

ఇలా.. రెండు పార్టీల మ‌ధ్య కొన‌సాగుతున్న కులం కాన్సెప్ట్ ఇప్పుడు ప‌రాకాష్ట‌కు చేరుకుంది. తాజాగా న్యూడ్ ఎంపీ.. గోరంట్ల మాధ‌వ్ వీడియో వివాదం.. కులాల మ‌ధ్య కుంప‌ట్ల‌కు దారితీసింది. బీసీ సామాజిక వ‌ర్గం కుర‌బ‌కు చెందిన గోరంట్ల వివాదాస్ప‌ద అంశాన్ని వైసీపీ నాయ‌కులు కులం కార్డుతో చూస్తున్నారు. టీడీపీ చేస్తున్న‌ది.. గోరంట్ల‌పై విమ‌ర్శ‌లు కాద‌ని.. బీసీల‌పైనేన‌ని.. వారు వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీకి చెందిన కురబ సామాజిక వ‌ర్గం నాయ‌కులు.. ఈ విష‌యాన్ని గ‌ట్టిగా చెబుతున్నారు.

అంతేకాదు.. క‌మ్మ సామాజిక‌వ ర్గం బీసీలుగా ఉన్న కుర‌బ‌ల‌పై దాడులు చేసేందుకు సిద్ధ‌మైంద‌ని.. బీసీ ల ఓట్లు టీడీపీకి అవ‌స‌రం లేదా? అని వారు  ప్ర‌శ్నిస్తున్నారు. అంతేకాదు.. క‌మ్మ‌ల‌పై తిరుగుబాటు త‌ప్ప‌ద‌ని కూడా హెచ్చ‌రించారు. బీసీ ఎంపీ అయిన‌.. గోరంట్ల ఫొటోపై చెప్పుతో ఎలా కొడ‌తార‌ని వారు ప్ర‌శ్నించారు. మొత్తంగా చూస్తే.. ఈ ప‌రిణామాల వెనుక‌.. బీసీల‌ను క‌మ్మ‌ల‌కు దూరం చేసే వ్యూహం ఏదో... 'పై స్థాయి' నుంచి జ‌రుగుతున్న‌ట్టు క‌నిపిస్తోంద‌ని అంటున్నారు.

లేదా.. ఈ వ్యూహంతో టీడీపీ ఎంపీ న్యూడ్ వివాదం నుంచి త‌ప్పుకొనేలా అయినా.. చేస్తున్నార‌ని.. ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. ఏదేమైనా.. న్యూడ్ ఎంపీ వివాదానికి కులం కార్డు ప‌డ‌డం.. ఇప్పుడు ర‌స‌వ‌త్త‌రంగా మారింది. మ‌రి ఇది ఎటు మ‌లుపు తిరుగుతుందో చూడాలి.