Begin typing your search above and press return to search.

అసెంబ్లీ సమావేశాల్లో ఏం జరగబోతోంది ?

By:  Tupaki Desk   |   6 March 2022 5:59 AM GMT
అసెంబ్లీ సమావేశాల్లో ఏం జరగబోతోంది ?
X
'ఈ అసెంబ్లీ సమావేశాలు చాలా ప్రత్యేకం..సభ్యులందరికీ ఇళ్ళ దగ్గర, అసెంబ్లీ, కౌన్సిల్ దగ్గర ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటుచేయండి' ఇది తాజాగా అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ చేసిన వ్యాఖ్యలు. పై వ్యాఖ్యలకు అనుగుణంగానే భద్రత కల్పించే విషయంలో డీజీపీ రాజేంద్రనాద్ రెడ్డికి స్పీకర్ ఆదేశాలు జారీచేశారు.

సోమవారం నుండి ప్రారంభం అవబోతున్న బడ్జెట్ సమావేశాలు ఎందుకింత ప్రత్యేకం ? ఎప్పుడూ జరిగినట్లే కదా ఇపుడు కూడా సమావేశాలు జరుగుతాయని మామూలు జనాల్లో అనుమానాలు పెరిగిపోతున్నాయి.

అయితే రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో హైకోర్టు తీర్పు నేపధ్యంలోనే ఈ సమావేశాలు ప్రత్యేకంగా మారింది. ప్రభుత్వ ఆలోచనలకు భిన్నంగా హైకోర్టు తీర్పిచ్చింది. కోర్టు తీర్పును ప్రభుత్వం అమలు చేయాలని అనుకోవటం లేదు.

అమరావతి విషయంలో కోర్టు తీర్పు కాకుండా అసలు ప్రభుత్వం, అసెంబ్లీ ఉనికిని, అధికారాలనే ప్రశ్నించేదిగా ఉంది. రాజధాని విషయంలో చట్టాలు చేసే అధికారం, రాజధానిని మార్చే అధికారం ప్రభుత్వానికి, అసెంబ్లీకి లేనేలేదని హైకోర్టు చెప్పటమే విచిత్రంగా ఉంది.

దీన్నే మంత్రులు, అధికార పార్టీ ఎంఎల్ఏలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. కోర్టు తీర్పు శాసన, కార్యనిర్వాహక వ్యవస్ధల్లోకి చొచ్చుకుని వచ్చినట్లుందని అభిప్రాయపడుతున్నారు. రాజధానిపై నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వానికి, అసెంబ్లీకి లేదని కోర్టు చెప్పటమే కరెక్టయితే మరి ఇంతకుముందు చంద్రబాబు ప్రభుత్వం కూడా తప్పుచేసినట్లే కదాని మంత్రులు మండిపడుతున్నారు. శాసనవ్యవస్ధలోకి కోర్టు జొరబడుతోందనే అభిప్రాయం ప్రభుత్వం వైపు నుండి బలంగా వినబడుతోంది.

ఈ నేపథ్యంలో కోర్టుల అధికారం, పరిధిపైన అసెంబ్లీలో చర్చించాలని మంత్రులు, సీనియర్ సభ్యుడు ధర్మాన ప్రసాదరావు బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే అమరావతి విషయంతో పాటు కోర్టు పరిది, అధికారంపైన విస్తృతంగా చర్చ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి.

సహజంగానే ఈ విషయాలన్నీ అమరావతి మద్దతుదారులకు ఏమాత్రం ఇష్టముండదు. అసెంబ్లీ, సెక్రటేరియట్ భవనాలు అమరావతి మధ్యలోనే ఉంది కాబట్టే ప్రత్యేక బందోబస్తు ఏర్పాటుచేయాలని స్పీకర్ ఆదేశించారు. మరి సమావేశాలు మొదలైతే కానీ ఏమి జరుగుతుందనే విషయంలో క్లారిటి రాదు.