Begin typing your search above and press return to search.

ఏపీ అసెంబ్లీలో హోదా ర‌చ్చ అదిరింది

By:  Tupaki Desk   |   8 Sep 2016 7:06 AM GMT
ఏపీ అసెంబ్లీలో హోదా ర‌చ్చ అదిరింది
X
ఏపీ అసెంబ్లీ స్టార్ట‌యిన తొలిరోజే ప్ర‌త్యేక హోదా ఎఫెక్ట్ స‌భ‌ని కుదిపేసింది. బుధ‌వారం నాటి కేంద్రం స్టేట్‌ మెంట్ ఎఫెక్ట్ స‌భ మీద ప‌డుతుంద‌ని ఊహించిన‌ట్టే.. జ‌ర‌గ‌డం విశేషం. కేవ‌లం మూడు రోజులే స‌భ నిర్వ‌హించేందుకు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. అయితే, గురువారం స‌భ ప్రారంభం కాగానే.. హోదా అంశంపై అధికార టీడీపీని ఇరుకున పెట్టేందుకు జ‌గ‌న్ పార్టీ వైకాపా తీవ్రంగా ప్ర‌య‌త్నించింది. హోదా ఇచ్చేదిలేద‌ని ఆర్థిక మంత్రి జైట్లీ ప్ర‌క‌టించ‌డం, దీనిని చంద్ర‌బాబు అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత నిర్వ‌హించిన మీడియా మీటింగ్‌లో స్వాగ‌తించ‌డాన్ని జ‌గ‌న్ పార్టీ స‌భ్యులు తీవ్ర‌స్థాయిలో త‌ప్పుప‌ట్టారు. హోదా ఆంధ్రుల హక్కు అంటూ వైకాపా స‌భ్యులు నినాదాలు చేశారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా అంశంపై త‌క్ష‌ణ‌మే చ‌ర్చ చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు.

అయితే, ఈ విష‌యంపై ప్ర‌భుత్వం ఒక ప్ర‌క‌ట‌న చేస్తుంద‌ని, అప్ప‌టి వ‌ర‌కు దీనిపై ఎలాంటి అనుమ‌తులూ ఉండ‌బోవ‌ని స‌భావ్య‌వ‌హారాల మంత్రి హోదాలో ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు ప్ర‌క‌టించారు. అయినా కూడా వైకాపా స‌భ్యులు శాంతించ‌లేదు. దీంతో మైకు తీసుకుని రంగంలోకి దిగిన టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా మ‌హేశ్వ‌ర‌రావు - మంత్రి అచ్చెన్నాయుడులు త‌మ స్టైల్‌ లో వైకాపాపై విరుచుకుప‌డ్డారు. అసలు వైకాపాకే హోదాపై చిత్త‌శుద్ధి లేద‌ని బోండా విమ‌ర్శ‌లు గుప్పించారు. జ‌గ‌న్‌ కు ఈ విష‌యంలో క్లారిటీ ఉంటే.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఇంటి ముందు ధ‌ర్నాకు ఎందుకు దిగ‌లేద‌ని ప్ర‌శ్నించారు. ఈ స‌మ‌యంలో స్పీక‌ర్ మైక్ ఇవ్వ‌డంతో మాట్లాడిన జ‌గ‌న్‌.. హోదాపై రెండు సార్లు ఇదే స‌భ‌లో తీర్మానం చేసి.. పంపామ‌ని గుర్తు చేశారు.

కానీ ఇప్పుడు హోదా ఇవ్వబోమని అరుణ్ జైట్లీ చెబితే దాన్ని చంద్రబాబు ఎలా స్వాగతిస్తారని ప్రశ్నించారు. అయితే, జ‌గ‌న్ మాట్లాడుతూ ఉండ‌గానే మైక్ క‌ట్ అయింది. దీంతో వైకాపా స‌భ్యులు ఆందోళ‌న‌కు దిగారు. మరోసారి జోక్యం చేసుకున్న యనమల … తాము స్టేట్‌మెంట్ ఇచ్చేవరకు హోదా అంశంపై సభలో మాట్లాడేందుకు వీలులేదని స్పష్టం చేశారు. ఓ దశలో స్పీకర్‌ కూడా వైసీపీ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. ”మీరు(జగన్‌) మాట్లాడినప్పుడు మాత్రమే మీ వాళ్లు కూర్చుకుంటున్నారు. మరెవరినీ మాట్లాడనివ్వడం లేదు. అసెంబ్లీ సిబ్బందిని కూడా పనిచేయనివడం లేదు”. అని అన్నారు. అయినా.. వైకాపా స‌భ్యులు శాంతించ‌క‌పోగా నినాదాల హోరు ను మ‌రింత పెంచారు. దీంతో స్పీక‌ర్ స‌భ‌ను వాయిదా వేశారు.