Begin typing your search above and press return to search.

చక్రాల కుర్చీ మీద వెలగపూడి సచివాలయానికి..

By:  Tupaki Desk   |   4 Oct 2016 5:12 AM GMT
చక్రాల కుర్చీ మీద వెలగపూడి సచివాలయానికి..
X
మీరు విన్నది నిజమే. ప్రభుత్వ ఉద్యోగుల పని తీరు మీదా.. వారి కమిట్ మెంట్ మీదా.. భావోద్వేగాల మీద సందేహాలు ఉన్న వారికి ఈ వార్త చదివితే వారు తమ అభిప్రాయాల్ని మార్చుకోవటం ఖాయం. మిగిలిన వారి మాదిరే ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ భావోద్వేగాలు తీవ్రస్థాయిలో ఉంటాయని.. వారిలో కమిట్ మెంట్ ఉంటుందన్న విషయాన్ని చెప్పే ఉదంతాలు తాజాగా చోటు చేసుకున్నాయి. ఉన్నట్లుండి ప్రభుత్వ ఉద్యోగుల కమిట్ మెంట్.. భావోద్వేగాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏందన్న డౌట్ రావొచ్చు. దానికి సముచిత కారణం లేకపోలేదు.

దశాబ్దాల అనుబంధాన్ని విడిచి పెట్టి.. ఏపీ సచివాలయ ఉద్యోగులు హైదరాబాద్ నుంచి ఏపీ రాజధాని అమరావతిలోని వెలగపూడి నుంచి పని సోమవారం నుంచి షురూ కావటం తెలిసిందే. ఇప్పటికే పలువురు ఉద్యోగులు దశల వారీగా హైదరాబాద్ కు వచ్చారు. తాజాగా సచివాలయంలోని వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు సోమవారం నుంచి తమ పనిని మొదలు పెట్టారు. మొత్తం 32 సచివాలయ శాఖలకు చెందిన ఉద్యోగులు వెలగపూడికి రావాల్సి ఉంది. సోమవారానికి 28 శాఖల ఉద్యోగులు వచ్చేయగా.. మరో నాలుగు శాఖల ఉద్యోగులు వెలగపూడికి రావాల్సి ఉంది. మరో రెండు మూడు రోజుల్లో వారు కూడా రానున్నారు.

ఇదిలా ఉంటే.. తొలి రోజున వెలగపూడి నుంచి పని చేయటానికి వీలుగా పలువురు ఉద్యోగులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. మొదటిరోజు అనుభూతిని మిస్ కాకూడదని భావించి.. తమకున్న వ్యక్తిగత సమస్యల్ని అధిగమించి మరీ వెలగపూడికి రావటం పలువురి దృష్టిని ఆకర్షించింది. అందరి సంగతి ఎలా ఉన్నా.. ఒక ఉద్యోగి మాత్రం అందరిలో భిన్నంగా కనిపించారు.

సచివాలయంలోని సాధారణ పరిపాలనా శాఖలో పని చేసే రవికాంత్ అనే అధికారి కాలికి ఇటీవలే శస్త్ర చికిత్స జరిగింది. అయితే.. వెలగపూడిలో మొదటిరోజును మిస్ కాకూడదన్న ఉద్దేశంతో చక్రాల కుర్చీ మీద సచివాలయానికి రావటం అందరిని ఆకర్షించింది. ఒక మంచి అనుభూతిని మిస్ కాకూడదని తాను కష్టమైనా వెలగపూడికి వచ్చినట్లుగా సదరు ఉద్యోగి పేర్కొన్నారు. ఇక.. సచివాలయ ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేకరైలు సోమవారం సందడి.. సందడిగా మారింది. దాదాపు 300 పైగా ఉద్యోగులు ప్రత్యేకంగాఈ రైల్లో విజయవాడకు చేరుకున్నారు. సచివాలయ మహిళా ఉద్యోగులంతా ఒకే బోగీలో ప్రయాణించటం విశేషం.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతానికి వారంలో ఒక్కరోజు హైదరాబాద్ వెళ్లి వస్తామని.. త్వరలోనే బెజవాడలో కానీ.. సచివాలయ సమీపంలో ఇంటిని మార్చుకోనున్నట్లుగా పలువురు ఉద్యోగులు చెప్పుకొచ్చారు. ఇక.. సోమవారం వెలగపూడి సచివాలయానికి వచ్చిన ఉద్యోగులకు ఘన స్వాగతం లభించింది. మిఠాయిలు.. కనకదుర్గ అమ్మవారి ప్రసాదాలు.. ఇలా స్పెషల్.. స్పెషల్ గా తొలి గడిచిపోయింది. మధ్యాహ్న వేళ.. ఉద్యోగులంతా కలిసి భోజనం చేశారు. మొత్తానికి వెలగపూడిలో తొలిరోజు వాతావరణం కొత్త ఉత్సాహం నెలకొని ఉండటం గమనార్హం.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/