Begin typing your search above and press return to search.

కేసీఆర్ జైలుకు... జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు.. ఇదేనా బీజేపీ బెదిరింపు

By:  Tupaki Desk   |   3 April 2021 3:00 PM IST
కేసీఆర్ జైలుకు... జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు.. ఇదేనా బీజేపీ బెదిరింపు
X
``వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అధికారంలోకి రావాలి!``- ఇదీ బీజేపీ వ్యూహం. వ్యూహం మంచిదే.. ఏ పార్టీకైనా.. అధికార‌మే ప‌ర‌మావ‌ధి. దీనిని ఎవ‌రూ కాద‌నరు. అయితే.. దీనికి సంబంధించి ఎలా వ్య‌వ‌హ‌రించాలి? ప్ర‌జ‌ల‌కు ఎలా చేరువ కావాలి? అనే విష‌యాల‌పై దృష్టి పెడుతున్నారా? అంటే.. అది మాత్రం బీజేపీలో క‌నిపించ‌డం లేదు. పైగా ఎన్నిక‌ల స‌మ‌యానికి వ్య‌వ‌స్థ‌ల‌ను గుప్పిట పెట్టుకుని.. దారు ణంగా వాటిని ప్ర‌యోగిస్తూ.. నేత‌ల‌ను త‌మ చెప్పు చేత‌ల్లోకి తెచ్చుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.

ఒక‌ప్పుడు కాంగ్రెస్ కూడా ఇలానే వ్య‌వ‌హ‌రించింది. అప్ప‌ట్లో కాంగ్రెస్‌ను తిట్టిపోయిన బీజేపీ.. ఇప్పుడు అదే పంథాను అనుస‌రిస్తుండ‌డం గ‌మ‌నార్హం. హైద‌రాబాద్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లోనూ.. ఇప్పుడు నాగా ర్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌లోనూ బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌.. ఇదే త‌ర‌హా వాద‌న చేస్తున్నా రు. ``కేసీఆర్ త్వ‌ర‌లోనే జైలుకు వెళ్తాడు`` అని సంజ‌య్ కామెంట్లు చేస్తున్నారు. ఇక‌, ఏపీలోనూ బీజేపీ నేత‌లు ఇదే త‌ర‌హా రాజ‌కీయాలు చేస్తున్నారు. తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌లోకూడా బీజేపీ నేత‌లు ఇదే త‌ర‌హా వ్యాఖ్య‌లు చేస్తున్నారు.

ముఖ్యంగా బీజేపీ ఏపీ వ్య‌వ‌హారాల ఇంచార్జ్ సునీల్ దేవ్‌ధ‌ర్‌.. ఏపీ సీఎం జ‌గ‌న్‌కు బెయిల్ ర‌ద్దు అవుతుంద ‌ని కామెంట్లు చేస్తున్నారు. అంటే.. బీజేపీ నేత‌లు చెప్పేదే జ‌రుగుతుందా? కోర్టులు వాళ్ల చేతుల్లో ఉన్నా యా అనేది అనుమానంగా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. నిజానికి అటు తెలంగాణ ముఖ్య‌మంత్రి అయినా.. ఇటు ఏపీ సీఎం అయినా.. త‌ప్పులు చేస్తే.. కోర్టులు చూసుకుంటాయ‌నేది అంద‌రికీ తెలిసిందే. కానీ, బీజేపీ నేత‌లు మాత్రం ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా.. ఈ త‌ర‌హా బెదిరింపుల‌కు దిగుతున్నారు. సీబీఐ, ఈడీ బీజేపీ చేతిలో ఉన్నందునే ఇలా బెదిరిస్తున్నారా? అనే చ‌ర్చ ప్ర‌జ‌ల్లో సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

గ‌తంలో యూపీఏ స‌ర్కారు హ‌యాంలోనూ ఇలానే బెదిరించారు. రాష్ట్రాల నేత‌ల‌పై జోరుగా దాడులు చేయించారు. మ‌రి ఇప్పుడు ఆ పార్టీ ప‌రిస్థితి ఏమైంది? రోడ్డున ప‌డ‌లేదా? అనేది ప్ర‌శ్న‌. ఇప్పుడు బీజేపీకి కూడా అదే గ‌తి ప‌డుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్ప‌టికే త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో కీల‌క స‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష నేత‌ల ఇళ్ల‌పై ఐటీ దాడులు చేయిస్తున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు అక్క‌డ ఉన్న సింప‌తీ కాస్తా బీజేపీపై పోయింది. మ‌రి ఇలానే వ్య‌వ‌హ‌రిస్తే.. ఇక‌ముందు.. ఇత‌ర రాష్ట్రాల్లోనూ ఇంతే! అనే వ్యాఖ్య‌లు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.