Begin typing your search above and press return to search.
ఖైరతాబాద్ వినాయకుడికి ప్రసాదంగా వచ్చేసిన ఏపీ లడ్డూ
By: Tupaki Desk | 22 Aug 2020 9:30 AM ISTరెండు తెలుగు రాష్ట్రాల మద్య విభజన రేఖలు తొలిగిపోతున్నాయి. విభజన వేళ.. విడిపోయి కలిసి ఉందామన్న మాటకు అసలైన అర్థంగా ఇటీవల కాలంలో కొన్ని ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణలో లేకున్నా.. ఏపీలో మాత్రం తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిని.. అసలుసిసలు తెలంగాణవాదుల్ని ఏపీ ప్రభుత్వం సలహాదారుల రూపంలో నియమించుకోవటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. విభజన తర్వాత.. ఏపీకి చెందిన వాటిపై అభ్యంతరాలు వ్యక్తమయ్యేవి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసే హైదరాబాద్ లోని ఖైరతాబాద్ మహా వినాయకుడి విగ్రహానికి లడ్డూ ప్రసాదం కోసం తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రత్యేకంగా లడ్డూను తీసుకొచ్చేవారు. వేల కేజీల ఈ లడ్డూను ఉచితంగానే ఇచ్చేవారు. విభజన తర్వాత.. ఖైరతాబాద్ విగ్రహానికి ఏపీ లడ్డూ అవసరమేమిటి? తెలంగాణలో తయారు చేసిన లడ్డూను వాడొచ్చుకదా? అన్న వాదనలు వినిపించాయి.
తొలుత ఇలాంటి అభ్యంతరాల్లో లాజిక్ అర్థం కాక బుర్ర గీక్కునే పరిస్థితి. ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు వచ్చేసింది. గతంలో మాదిరి ఖైరతాబాద్ వినాయకుడికి ఇచ్చే ప్రసాదాన్ని సురుచి సంస్థ అధినేత పోలిశెట్టి మల్లికార్జున రావు తాజాగా పంపారు. కరోనా నేపథ్యంలో.. భారీ విగ్రహం స్థానే తొమ్మిది అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో.. వేల కేజీల లడ్డూ ప్రసాదం కాస్తా.. వంద కేజీల లడ్డూ ప్రసాదంగా కుదించారు.
ఈ లడ్డూపై వినాయకుడి ప్రతిమను అందంగా నెలకొల్పటం మరింత ఆకర్షణీయంగా మారింది. ఖైరతాబాద్ వినాయక ఉత్సవ కమిటీ అభ్యర్థన నేపథ్యంలో లడ్డూను తయారు చేసినట్లుగా ఈ సంస్థ అధినేత మల్లిబాబు చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో గతంలో మాదిరి హడావుడి చేయకుండా.. సింఫుల్ గా మహా లడ్డూ ప్రసాదాన్ని ఖైరతాబాద్ కు తరలించేశారు. మొత్తానికి.. విడిపోయి కలిసి ఉందామనే ఆకాంక్ష మొత్తానికి వాస్తవ రూపం దాలుస్తుందని చెప్పక తప్పదు.