Begin typing your search above and press return to search.

హైకోర్టు సీజే బదిలీ ?

By:  Tupaki Desk   |   15 Dec 2020 3:34 PM GMT
హైకోర్టు సీజే బదిలీ ?
X
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి బదిలీ అయ్యారా ? సీజేని సుప్రింకోర్టు కొలీజియమే మహేశ్వరిని బదిలీ చేసిందా ? అవుననే సమాచారం వినిపిస్తోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మహేశ్వరిని సిఖ్ఖిం హైకోర్టు సీజేగా బదిలీ చేసినట్లు సమాచారం. అలాగే సిఖ్ఖిం హైకోర్టు చీఫ్ జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి ని నియమించినట్లు సమాచారం.

మహేశ్వరి బదిలీకి జగన్ ఢిల్లీ స్ధాయిలో పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నట్లు రెండు రోజుల క్రితం సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మీడియా సమావేశంలో ఆరోపణలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇదే సమయంలో తెలంగాణా హైకోర్టు చీఫ్ జస్టిస్ ను కూడా కొలీజియం బదిలీ చేసిందనే సమాచారం వినబడుతోంది. దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టుల్లో ఉన్న ఐదారుగురు చీఫ్ జస్టిస్సులను బదిలీ చేయటంలో భాగంగా వీళ్ళ బదిలీలు జరిగినట్లు చెప్పుకుంటున్నారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహేశ్వరితో పాటు మరికొందరు జడ్జీలు ఉద్దేశ్యపూర్వకంగా వ్యాఖ్యలు చేస్తున్నట్లు ప్రభుత్వం సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ ఏఎస్ బాబ్డేకి లేఖ రూపంలో ఫిర్యాదు చేసినట్లు తెలిసిందే. ఉద్దేశ్యపూర్వకంగానే ప్రభుత్వ వ్యతిరేక పిటీషన్లను ఎంటర్ టైన్ చేస్తున్నట్లు ప్రభుత్వం భావించినట్లు ప్రచారంలో ఉంది. ఇందులో భాగంగానే ఏడు పేజీల లేఖ రూపంలో ప్రభుత్వం నుండి ఫిర్యాదు వెళ్ళింది.