Begin typing your search above and press return to search.

ఇదీ యనమల 'పన్ను' కధ

By:  Tupaki Desk   |   23 Aug 2018 5:11 PM GMT
ఇదీ యనమల పన్ను కధ
X
రాజు తలచుకుంటే దెబ్బలకే కాదు డబ్బులకు కొదవుండదు. వడ్డించేవాడు మన వాడే అయితే ఫంక్తిలో ఎక్కడ కూర్చున్న వడ్డన అక్కడకే వస్తుంది. ఈ సామేతలు ఆంధ్రప్రదేశ్‌ లో నిజమనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ లో ఆర్దిక శాఖ మంత్రి యనమల రామక్రిష్ణుడి ఆరోగ్యంపై - ఆయనకు చేసిన చికిత్సపై ఓ వార్తా కథనం వెబ్‌ సైట్లలోనూ - సోషల్ మీడియాలలోను చక్కర్లు కొడుతోంది. ఆంధ్రప్రదేశ్ ఆర్దిక మంత్రి యనమల రామక్రిష్ణుడు గత కొంత కాలంగా పంటి నొప్పితో బాధపడుతున్నారట. దానికి చికిత్స చేయించుకుందుకు మంత్రి యనమల సింగపూర్ వెళ్లినట్లు ఆ కథనంలో పేర్కొన్నారు. మంత్రి చికిత్స కోసం దాదాపు 3 లక్షల వరకూ ఖర్చు అయ్యిందని ఆ కథనంలో పేర్కొన్నారు. ఈ చికిత్స నిమిత్తం యనమల రామక్రిష్ణుడు ఏకంగా సింగపూర్‌ కు వెళ్లడం చర్చనీయంశామయింది. ఈ చికిత్సకు అయిన ఖర్చులో దాదాపు 2,88,823 రూపాయలు మంత్రికి చెల్లించాలంటూ రాష్ట్ర ఆర్దిక శాఖ నుంచి జీఓ.నెం. ఆర్‌ టి. 1844 ను గురువారం నాడు ప్రభుత్వం విడుదల చేసినట్లు ఆ కథనంలో పేర్కొన్నారు. దీంతో మంత్రి చికిత్సకు చెందిన కథనంపై తెలుగు రాష్ట్రాలలో తీవ్ర చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

నిజానికి మంత్రి యనమల రామక్రిష్ణుడుకు చికిత్స కోసం ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సిన అవసరం లేదని కథనంలో పేర్కోన్నారు. అంతే కాదు అధునాతన వైద్యం - అన్నీ పట్టణాలు - నగరాలలో దొరుకుతున్న ఈ రోజులలో సింగపూర్‌లో ఎందుకు వైద్యం చేయించుకోవాలని ఆ కధనంలో ప్రశ్నించారు. హైదారబాద్ - విజయవాడలలో యనమల చికిత్స కోసం 5000 రూపాయలు ఖర్చు అవుతుందని అతి పెద్ద కార్పోరేట్ ఆసుపత్రిలలో అయితే 50 వేలకు మించి ఖర్చు కాదని కథనంలో పేర్కోన్నారు. ఈ మాత్రం వైద్యానికి సింగపూర్ వరకూ వెళ్లాల్సిన అవసరం లేదంటూ కూడా వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌ ను సంపూర్ణ ఆరోగ్య ప్రదేశ్‌ గా తీర్చిదిద్దుతామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి యనమల రామక్రిష్ణుడి పంటి చికిత్స కోసం ఏకంగా సింగపూర్ పంపండం ఏవిధంగా సమర్దించుకుంటారని ఆ కథనంలో పేర్కొన్నారు. దీంతో పాటు ప్రజల ఆరోగ్యంపై కనీస శ్రద్ద కూడా చూపించని ప్రభుత్వం మంత్రుల కోసం విదేశాలలో లక్షలకు - లక్షలు ఖర్చు పెట్టడం ఏవిధంగా సమంజసం అని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.