Begin typing your search above and press return to search.

బ‌డా కార్ల కంపెనీ కోసం ఏపీ, టీఎస్ పోటాపోటీ

By:  Tupaki Desk   |   1 Dec 2016 4:14 PM GMT
బ‌డా కార్ల కంపెనీ కోసం ఏపీ, టీఎస్ పోటాపోటీ
X
రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం ప‌రిశ్ర‌మ‌లో ఏర్పాటులో పోటాపోటీగా ముందుకు సాగుతున్న తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్టాలు మ‌రో బ‌డా సంస్థను త‌మ రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు పోటీ ప‌డుతున్నాయి. ఎల‌క్ట్రానిక్ కార్ల ఉత్ప‌త్తిలో ప్ర‌పంచంలోనే నంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉన్న టెస్లా కార్ల లిథియం ఐయాన్ బ్యాట‌రీల ఉత్ప‌త్తి కేంద్రాన్ని త‌మ రాష్ట్రంలో ఏర్పాటు చేయించేందుకు ఇరు రాష్ర్టాల ముఖ్య‌మంత్రులు పోటీ ప‌డుతున్నారు. వ‌రుస బెట్టి త‌మ బృందాల‌ను అమెరికాలో ఉన్న ఆ సంస్థ ప్ర‌ధాన కార్యాల‌యానికి పంపించి లాబీయింగ్ చేస్తున్నాయ‌ని వార్త‌లు వెలువ‌డుతున్నాయి.

టెస్లా వ్య‌వ‌స్థాప‌కుడు అయిన ఎలెన్ ముస్క‌ర్ తో స‌మావేశం అయ్యేందుకు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌త్యేక బృందాన్ని పంచించారు. అంతేకాకుండా సీఎం కేసీఆర్‌ త‌న‌యుడు, రాష్ట్ర పరిశ్ర‌మల శాఖా మంత్రి అయిన కేటీఆర్ త‌న అమెరికా ప‌ర్య‌ట‌న‌లో టెస్లా కార్యాల‌యాన్ని సంద‌ర్శించి ఈ మేర‌కు త‌న ప్ర‌తిపాద‌న‌లు అంద‌జేశారు. త‌మ రాష్ట్రంలో ఉన్న ప్ర‌త్యేకత‌ల‌ను, రాష్ట్ర ప్ర‌భుత్వం అందించే స‌హాయాన్ని వివ‌రించారు. అదే స‌మ‌యంలో ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు సైతం త‌మ బృందాల‌తో ప‌లు ద‌ఫాలుగా మంత‌నాలు జ‌రిపించారు. ఇదిలాఉండ‌గా మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ సైతం త‌మ రాష్ట్రంలో టెస్లా కార్ల బ్యాట‌రీ ప్లాంటును ఏర్పాటుచేయించేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తున్నారు. త‌మ రాష్ట్రంలో ఉన్న ఓడ‌రేవు టెస్లా కార్ల ఎగుమ‌తుల లక్ష్యానికి అనుగుణంగా ఉంటుంద‌ని ప్ర‌త్యేకంగా నొక్కిచెప్పారు.

గ‌త ఏడాది భార‌త‌దేశ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఎలెన్ ముస్క‌ర్ ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోడీతో స‌మావేశం అయిన సంద‌ర్భంగా త‌మ ప్లాంటు ఏర్పాటు గురించి ప్ర‌స్తావించారు. ఈ సంద‌ర్భంగా వ‌చ్చిన ప్ర‌తిపాద‌న‌పై ఆయా రాష్ర్టాలు పోటీ ప‌డుతున్నాయి. ఇందులో తెలుగు రాష్ట్రాలు ప్ర‌థ‌మ స్థానంలో నిలిచాయి. మొత్తంగా అంత‌ర్జాతీయంగా పేరొందిన‌ సంస్థ‌ రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ప‌ట్టువిడువ‌ని కృషి చేస్తుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/