Begin typing your search above and press return to search.

తీగ లాగే ప్రయత్నంలో ఆంధ్రా పోలీసులు

By:  Tupaki Desk   |   9 Jun 2015 7:17 AM GMT
తీగ లాగే ప్రయత్నంలో ఆంధ్రా పోలీసులు
X
భాగ్యనగరంలో తెలంగాణ పోలీసులు, ఆంధ్రా పోలీసుల మధ్య రసవత్తరమైన వార్‌ నడుస్తోంది. ఓవైపు ఓటుకు నోటు కేసులో రేవంత్‌ రెడ్డిని అరెస్టు చేసి.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి మీద కూడా కేసు పెట్టడానికి ఉన్న అవకాశాల్ని తెలంగాణ ఏసీబీ అధికారులు పరిశీలిస్తుంటే.. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు పెట్టడానికి ఆధారాలు సేకరించే ప్రయత్నంలో ఉన్నారు ఆంధ్రా పోలీసులు. ఫోన్‌ సంభాషణకు సంబధించి చంద్రబాబును తెలంగాణ పోలీసులు ఇరుకున పెట్టడం కంటే.. ఫోన్‌ ట్యాపింగ్‌ విషయంలో ఆధారాలు దొరికితే కేసీఆర్‌ పడే ఇబ్బందే ఎక్కువ.

ఫోన్‌ ట్యాపింగ్‌ పెద్ద నేరం. ఈ కేసు చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అందుకే ఆధారాల కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు ఆంధ్రా పోలీసులు. తెలంగాణ ఇంటలిజెన్స్‌ ఆఫీస్‌ కేంద్రం మీద ఆంధ్రా పోలీసులు నిఘా పెట్టినట్లు సమాచారం. మరోవైపు తొందరపడి ఫోన్‌ సంభాషణలు బయటపెట్టేసిన తెలంగాణ సర్కారుకు తాము ట్యాపింగ్‌ చేయలేదని నిరూపించడం చిన్న విషయమేమీ కాదు. ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందన్నది స్పష్టంగా తెలిసిపోతోంది. మీడియాకు విడుదల చేసింది స్టీఫెన్‌సన్‌ ఫోన్‌ రికార్డింగ్‌ అని చెబుతున్నప్పటికీ.. అది వాస్తవం కాకుంటే ఆధారాలు చూపించడం అసాధ్యం. ఈ నేపథ్యంలోనే ఫోన్‌ సంభాషణలు ట్యాపింగ్‌ ద్వారా సంపాదించినవి కావని నిరూపించే ప్రయత్నంలో తెలంగాణ పోలీసులుంటే.. అది ట్యాపింగే అని నిరూపించే ఆధారాలు సేకరించడానికి ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు ఆంధ్రా పోలీసులు. మరి ఎవరు గెలుస్తారో చూడాలి.