Begin typing your search above and press return to search.

ఏపీలో జనాలకు కరోనా భయం లేకుండా పోయింది..

By:  Tupaki Desk   |   29 March 2020 1:28 PM IST
ఏపీలో జనాలకు కరోనా భయం లేకుండా పోయింది..
X
కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. లక్షలమందికి సోకి వందలాది ప్రాణాలు తీస్తోంది. దీని నివారణకు సోషల్ డిస్టేన్స్ తప్ప మరో మార్గం లేదు. అందుకే ప్రధాని మోడీ లాక్ డౌన్ ప్రకటించి ప్రజలను ఇళ్లకే పరిమితం చేశారు. ఒకరినొకరు తాకకుండా.. గుంపులుగా తిరగకపోతే ఈ వ్యాధి అంటుకోదు.

అయితే ఏపీలో జనాలకు భయం లేకుండా పోయింది. తాజాగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన ఉచిత రేషన్ సరఫరా కోసం ప్రజలు ఎగబడుతున్న పరిస్థితి ఏపీలో కనిపిస్తోంది.

అన్ని జిల్లాల్లో అదే పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా ప్రకాశం జిల్లా గిద్దలూరులో చౌకదుకాణం 3 వద్ద రేషన్ కోసం లబ్దిదారులు నిబంధనలు ఉల్లంఘించి పెద్ద ఎత్తున గుమిగూడారు. రేషన్ కోసం ఎగబడ్డారు.

కరోనా వైరస్ అంటు వ్యాధి కావడంతో వ్యాపిస్తుందని తెలిసినా ఇలా రేషన్ కోసం ప్రజలు గుంపులుగా రావడం చూసి అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు. సామాజిక దూరం పాటించకపోతే కరోనా వ్యాపిస్తుందని.. అందరూ దూరంగా ఉంటూనే రేషన్ తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

నిత్యావసరాలు, కూరగాయల కోసం కూడా ఏపీలో ఇలానే ఎగబడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా రేషన్ కోసం కూడా జనాలు కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఇలా అయితే ఏపీలో విస్తరిస్తుందని జగన్ సర్కారు కఠిన నిబంధనలు, బయట తిరగే గంటలను తగ్గించాలని డిసైడ్ అయ్యింది.