Begin typing your search above and press return to search.

తెలంగాణ తో పోలిస్తే ఏపీ మంత్రులు వెనకకు

By:  Tupaki Desk   |   4 Feb 2020 3:30 AM GMT
తెలంగాణ తో పోలిస్తే ఏపీ మంత్రులు వెనకకు
X
అభివృద్ధి - సంక్షేమ పథకాలు - కార్యక్రమాల విషయంలో తెలుగు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. జాతీయ స్థాయిలో హవా కనిపిస్తున్నాయి. ఇదంతా బాగానే ఉంది. కానీ తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ మంత్రులు వెనకబడ్డట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి దాదాపు ఏడు నెలలవుతోంది. ఇంకా పరిపాలనపై అంతగా శ్రద్ధ పెట్టనట్టు కనిపిస్తోంది. గత నిర్ణయాలను తిరిగి తోడుతూ ఉన్న ప్రభుత్వం పెట్టుబడులు తీసుకువచ్చేందుకు మాత్రం ప్రయత్నం చేస్తున్నట్టు కనిపించడం లేదు.

ఎందుకంటే ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి - మంత్రులు అధికారికంగా విదేశీ పర్యటనలు చేసిందీ లేదు. ముఖ్యమంత్రి జగన్ మాత్రం వ్యక్తిగతంగా విదేశీ పర్యటన చేశారు. కానీ అధికారికంగా పెట్టుబడుల ఆహ్వానించేందుకు ఎలాంటి పర్యటన చేయలేదు. గతంలో ఐటీ మంత్రిగా ఉన్న నారా లోకేశ్ అధికారికంగా విదేశీ పర్యటనలు చేసి హడావుడి చేశారు. ఆ పర్యటనలకు వచ్చిన కంపెనీలు ఎన్నో.. పెట్టుబడులు ఎంతో ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఐటీ మంత్రిగా ఉన్న మేకపాటి గౌతమ్ యువకుడు.. ఉన్నత విద్యావంతుడు. అయితే తన శాఖపై ఇంకా పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టినట్టు లేడు. విదేశీ పెట్టుబడులు అంటే ముఖ్యంగా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పెట్టే అవకాశం ఉంది. అందుకే పెద్దసంఖ్యలో పారిశ్రామికవేత్తలు ఐటీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తారు. మరి అలాంటి ప్రాధాన్యం ఉన్న శాఖకు మంత్రిగా ఉన్న గౌతమ్ రెడ్డి ఇంతవరకు ఒక్క విదేశీ పర్యటన జరపలేదు.

పక్క రాష్ట్రం తెలంగాణలో ఐటీ మంత్రిగా ఉన్న కేటీఆర్ మాత్రం వరుస విదేశీ పర్యటనలు చేశారు. ఇటీవల దావోస్ పర్యటనతో అందరీ దృష్టిని ఆకర్షించారు. దీంతో అతడికి వరుసగా అంతర్జాతీయ సంస్థల నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి. మళ్లీ విదేశీ పర్యటనలు చేసేందుకు కేటీఆర్ సిద్ధమవుతున్నాడు. మరీ పక్క రాష్ట్రంలో ఉన్న గౌతమ్ రెడ్డికి ఎలాంటి ఆహ్వానాలు దక్కడం లేదు. దీంతో ఏపీ మంత్రుల హడావుడి ఏం లేదని ప్రజలు భావిస్తున్నారు.

దీనికి కారణం లేకపోలేదని పలువురు పేర్కొంటున్నారు. రివర్స్ టెండరింగ్ - రాజధాని వికేంద్రీకరణ తదితర నిర్ణయాలతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ వస్తారని ప్రశ్నిస్తున్నారు. అయితే దీనికి అధికార పక్షం నుంచి మరో వాదన వినిపిస్తోంది. రాష్ట్రంలో అప్పుల్లో ఉంది.. విదేశీ పర్యటనలు చేసేంత స్థోమత లేదని చెబుతున్నారు. అధికారంలోకి వచ్చి కొన్నాళ్లేగా.. అని పేర్కొంటున్నారు.