Begin typing your search above and press return to search.

మహిళా హోం మంత్రిపై దారుణమైన పోస్ట్ - అరెస్ట్!

By:  Tupaki Desk   |   3 July 2019 5:26 PM IST
మహిళా హోం మంత్రిపై దారుణమైన పోస్ట్ - అరెస్ట్!
X
సోషల్ మీడియాలో హద్దు మీరి పోస్టులు పెట్టే వాళ్లు జాగ్రత్తగా ఉండాలనే హెచ్చరికలాంటి అంశం ఇది. ఏపీ హోం శాఖ మంత్రి మేకతోటి సుచరితను ఉద్దేశించి ఒక నెటిజన్ అర్థ రహితమైన పోస్ట్ ఒకటి పెట్టాడు.

తెలుగుదేశం పార్టీ అభిమానిగా ఖాతాను నడుపుతూ ఉన్న ఆ నెటిజన్ పేరు రామ్ మహరాజ్ అని తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భద్రత విషయంలో హోం మంత్రి ఇటీవల ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తనకు భద్రత తక్కువ అయ్యిందని చంద్రబాబు నాయుడు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో హోం మంత్రి స్పందించారు.

అన్నీ చట్ట ప్రకారమే అని ఆమె అన్నారు. దానిపై తెలుగుదేశం పార్టీ అభిమానులు ఫైర్ అయ్యారు. అయితే ఆ స్పందనలో కొంతమంది హద్దు మీరారు. హోంమంత్రి మహిళ అనే సంగతిని మరిచి ఆమెను దూషించారు. రాయలేని పదజాలాన్ని ఉపయోగించి ఒక రాష్ట్ర హోంమంత్రిని హెచ్చరించారు. అందుకు సంబంధించిన పోస్టును ఈ రామ్ మహరాజ్ అనే ఫేస్ బుక్ యూజర్ నుంచి వచ్చింది. ఈ నేఫథ్యంలో అతడిపై ఎవరో ఫిర్యాదు చేయడం - అతడి అరెస్టు కూడా జరగడం చకచకా జరిగిపోయింది.

నెటిజన్లు రాజకీయ అంశాలపై స్పందించవచ్చు. విమర్శలు చేయొచ్చు. అయితే ఏం చేసినా హద్దుల్లో ఉండాలి, అర్థవంతంగా ఉండాలి. అంతే కానీ.. అత్యాచారాలు చేస్తాం - చంపుతాం.. అంటూ పోస్టులు పెడితే మాత్రం కథ వేరే రకంగా ఉంటుందని స్పష్టం అవుతోంది.