Begin typing your search above and press return to search.
మోడీని ముగ్గులోకి లాగిన రాజధాని రైతులు
By: Tupaki Desk | 20 Jan 2015 9:56 PM ISTఏపీ రాజధాని భూముల సేకరణ విషయం ఢిల్లీలో రగులుతోంది. సామాజిక కార్యకర్తలు, పలు రాజకీయ పార్టీల నేతలు ఢిల్లీలో దీనిపై జాతీయ స్థాయి చర్చకు తెరలేపగా మరోవైపు రాజధాని రైతులు కూడా దీన్ని కేంద్రం వద్దకు తీసుకువెళ్లారు. ఏపీ రాజధానికి భూములు ఇవ్వడం ఇష్టంలేని రైతులు ఏకంగా మోడీపై భారం వేయడానికి సిద్ధమయ్యారు. దీంతో చంద్రబాబుతో మంచి సంబంధాలున్న బీజేపీ, మోడీలకు ఇది ఇరకాటంలో పెట్టే విషయంగా మారుతోంది.
ఏపీ రాజధానికి భూములు ఇవ్వడానికి ఇష్టం లేని రైతులంతా మోడీకి లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. రాజధాని ప్రాంత రైతులు ఇప్పటికే వెయ్యికిపైగా లేఖలు రాసి ప్రధాని మోడీకి పంపించారట. అందులో వారు భూసేకరణ విధానాలు, టీడీపీ ఏకపక్ష ధోరణి.. తమ భూముల సత్తా, విలువ వంటి చెబుతూనే తాము భూములు ఇచ్చేది లేదంటూ, చంద్రబాబును, టీడీపీని ఈ విషయంలో కట్టడి చేయాలని కోరారట. కేంద్రం జోక్యం చేసుకుని తమను ఈ సమీకరణ నుంచి మినహాయించాలని కోరినట్లు సమాచారం. అసలే ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీలు నెరవేర్చకుండా చంద్రబాబులో అసంతృప్తిని రగుల్చుతున్న ప్రధాని మోడీ ఈ విషయంలో జోక్యం చేసుకుంటారన్నది అనుమానమే. రైతుల ప్రయత్నం పెద్దదే అయినా సఫలమవుతుందన్న నమ్మకం మాత్రం కలగడం లేదు. అయితే, ఇలా దేశంలోని వేలమంది రైతులు నేరుగా మోడీనే ఆశ్రయించినా ఆయన జోక్యం చేసుకోకపోతే రాజకీయంగా విమర్శలు ఎదుర్కొనే ప్రమాదమూ ఉంది. దీంతో మోడీ పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. ఈ పరిస్థితిని మోడీ ఎలా డీల్ చేస్తారో మరి.