Begin typing your search above and press return to search.

మళ్లీ 3 వేల కోట్ల అప్పు

By:  Tupaki Desk   |   5 March 2016 12:44 PM IST
మళ్లీ 3 వేల కోట్ల అప్పు
X
ఆంధ్రప్రదేశ్ అప్పుల అప్పారావులా మారిపోయింది. రాబడి తగినంత లేకపోగా చెల్లింపులు - ఖర్చుల భారం అధికమై అప్పు చేయనిదే గడవని పరిస్థితి ఏర్పడింది. దీంతో రుణాల పరిమితీ ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో కొత్త అప్పుల కోసం కేంద్రాన్ని అనుమతి కోరగా ఆర్థిక శాఖ సరేననడంతో ఏపీ గవర్నమెంటు ఊపిరి పీల్చుకుంది.

అదనపు రుణాలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి లభించింది. మార్చిలో రూ.3వేల కోట్లు తీసుకు నేరదుకు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతిస్తూ రాష్ట్రానికి లేఖ రాసింది. వాస్తవంగా రాష్ట్ర వృద్ధి రేటు - ఆర్థిక యాజమాన్య విధానాల నేపథ్యంలో 15,050 కోట్లు మార్కెట్‌ బారోయింగ్స్ ద్వారా రుణాలు తీసుకునేందుకు అనుమతి ఉంది. ఈ మొత్తం రుణాలను రాష్ట్ర ప్రభుత్వం దశల వారీగా ఫిబ్రవరిలోనే వినియోగించుకుంది. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో మరో మూడు వేల కోట్లు రుణంగా తీసుకొనేందుకు అవకాశం ఇవ్వాలని జనవరిలోనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఈ మేరకు అదనపు రుణాన్ని తీసుకొనేందుకు అనుమతి ఇస్తూ కేంద్ర ప్రభుత్వం రిజర్వ్‌ బ్యాంకుకు గురువారం లేఖ రాసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో డిస్కాం బాండ్లను తనఖా పెట్టడం ద్వారా తీసుకోవాల్సిన 1565 కోట్ల రూపాయలను ఇంకా తీసుకోలేదని, అరదువల్ల ఈ మొత్తాన్ని కూడా మార్కెట్‌ బారోయింగ్స్ లో తీసుకునే అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం చాలాకాలంగా కోరుతోంది. కేంద్రం అనుమతించిన అదనపు రుణంలో రూ.1500 కోట్లను తక్షణమే వినియోగించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్‌ బ్యాంకును ఆశ్రయించింది. దీనికి ఈనెల 8న ముంబయిలో ప్రక్రియ నిర్వహించి తొమ్మిదో తేదీన ఆ మొత్తం రాష్ట్ర ఖజానాకు జమ అవుతుంది.