Begin typing your search above and press return to search.

ఏపీని రూపాయికి ఎకరం అడిగిన రిలయన్స్

By:  Tupaki Desk   |   23 Jun 2016 9:59 AM IST
ఏపీని రూపాయికి ఎకరం అడిగిన రిలయన్స్
X
రిలయన్స్ బిజినెస్ రూల్స్ ఎలా ఉంటాయి? ఆ సంస్థ వ్యవహరించే తీరు ఎలా ఉంటుందనటానికి ఈ ఉదంతం నిలువెత్తు నిదర్శనంగా చెప్పొచ్చు. విభజన నేపథ్యంలో పెద్దపెద్ద కంపెనీలు పెట్టుబడుల పెట్టాలంటూ ఆశగా ఎదురుచూస్తున్న వైఖరిని సొమ్ము చేసుకోవాలన్నట్లుగా అనీల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ భావిస్తున్నట్లు ఉంది. గత జనవరిలో విశాఖపట్నంలో పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు జరిగింది.

ఇందులో పాల్గొన్న రిలయన్స్ సంస్థ ఏపీలో డిఫెన్స్ రంగంలో పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. దీంతో.. ఏపీ సర్కారు.. ప్రజలు ఆనందానికి గురయ్యారు. తమ సమర్థతతో ఇలాంటి విజయాన్ని సొంతం చేసుకున్నట్లుగా ఏపీ సర్కారు గొప్పలు చెప్పుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా తనదైన శైలిలో వ్యవహరించిన రిలయన్స్ ఏపీ సర్కారుకు భారీ షాక్ నే ఇచ్చింది. అదెలానంటే.. విశాఖ సదస్సులో పెట్టుబడులు పెట్టటానికి సిద్ధమన్న రిలయన్స్ తన ప్రతిపాదనను ఏపీ సర్కారుకు పంపింది.

దీని ప్రకారం ఎకరం రూపాయి చొప్పున రెండు వేల ఎకరాల భూమిని రూ.2వేలకు తమ కంపెనీకి కేటాయిస్తే తాము సబ్ మెరైన్ల తయారీ కంపెనీని పెట్టనున్నట్లుగా రిలయన్స్ తన ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. ఈ ప్రతిపాదన చూసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ అండ్ కో షాక్ తిన్న పరిస్థితి. విశాఖ జిల్లాలోని నక్కపల్లి దగ్గర 2వేల ఎకరాల్ని సింఫుల్ గా రెండు వేల రూపాయిలకే అడిగిన రిలయన్స్ ఆఫర్ ను ఏపీ సర్కారు నో అని చెప్పేసింది. అయినా.. 2వేల ఎకరాలకు ఆ రెండు వేల రూపాయిలు ఇవ్వకపోతే ఏమైందో..?