Begin typing your search above and press return to search.
అజ్ఞాతవాసికి ‘చంద్ర’కానుక అదిరింది!
By: Tupaki Desk | 6 Jan 2018 11:14 PM ISTమొత్తానికి పవన్ కల్యాణ్ రాజకీయ అడుగులు.. ఆయన నిర్మాతలకు చాలా పెద్ద లాభాన్నే చేకూర్చి పెట్టబోతున్నాయి. 10వ తేదీన విడుదల కాబోతున్న ఆయన అజ్ఞాత వాసి చిత్రానికి ఎనలేని మేలు చేకూర్చేలా చంద్రబాబునాయుడు ప్రభుత్వం శనివారం రాత్రి పదిగంటల సమయంలో నిర్ణయం తీసుకుంది. వారం రోజులపాటూ ఏకధాటిగా అజ్ఞాతవాసి చిత్రం స్పెషల్ షోలు వేసుకోవడానికి అనుమతించారు. రాత్రి 1 గంట నుంచి ఉదయం 10 గంటల వరకు ఏడు రోజుల పాటూ స్పెషల్ షోలు వేసుకోవచ్చు.
నిజానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా.. ఈ చిత్రానికి స్పెషల్ షోల కోసం నిర్మాతలు తీవ్రస్థాయిలో ప్రయత్నం చేశారు. విడుదల ఒక్కరోజు సాధారణంగా ఫ్యాన్స్ కోసం ఇలాంటి షోలు వేస్తుంటారు. అయితే ఓపెనింగ్ కలెక్షన్ల మీదనే కన్నేసి ఏకంగా వారం రోజుల పాటూ అనుమతులు అనేది ఇదే ప్రథమం అని పరిశ్రమలో చెప్పుకుంటున్నారు.
నిర్మాతలు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను సంప్రదించినప్పటికీ.. తెలంగాణలోని కేసీఆర్ సర్కారు మాత్రం ఇప్పటిదాకా నిర్ణయం తీసుకోలేదు. సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ - నిర్మాత లతో కలిసి ఇదే విషయం మీద ఇవాళ తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తో కూడా భేటీ అయ్యారు. అయినప్పటికీ నిర్ణయం మాత్రం రాలేదు. ఈలోగా శనివారం రాత్రి ఏపీ ప్రభుత్వం మాత్రం స్పెషల్ షోలకు అనుకూల నిర్ణయం తీసుకుంది. దీనివల్ల.. అజ్ఞాతవాసి చిత్రానికి ఓపెనింగ్ కలెక్షన్లు వెల్లువలా వచ్చి పడతాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.