Begin typing your search above and press return to search.

కరోనాపై జగన్ సర్కార్ ప్లాన్స్ అదుర్స్

By:  Tupaki Desk   |   29 March 2020 4:49 PM IST
కరోనాపై జగన్ సర్కార్ ప్లాన్స్ అదుర్స్
X
కరోనా రక్కసి ఇప్పుడు దేశాన్ని పట్టుకుంది. అందరూ లాక్ డౌన్ తో ఇళ్లకే పరిమితమయ్యారు. మాస్కులు, శానిటైజర్ల కొరత వేధిస్తోంది. మాస్కులు లేక చాలా మంది వ్యాధి బారిన పడుతున్నారు. దీంతో ప్రభుత్వాలు ఇప్పుడు మాస్కుల తయారీపై ఫోకస్ పెట్టాయి. ఏపీలోని కొన్ని జైళ్లలో ఇప్పుడు ఖైదీల సాయంతో మాస్కులను పెద్ద ఎత్తున తయారు చేస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ట్విట్టర్ ద్వారా తెలిపారు. నెల్లూరు జిల్లా ఖైదీలు మాస్కులు తయారు చేస్తున్న ఫొటోను ఆయన ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు.

కరోనా ప్రబలుతున్న ఈ తరుణంలో సెంట్రల్ జైల్ ఖైదీలు తమ వంతు సాయంగా ఫేస్ మాస్కులు తయారు చేయడం అభినందనీయమని గౌతమ్ రెడ్డి తెలిపారు. ఖైదీలకు ధన్యవాదాలు తెలిపారు.

ఇక నిత్యావసరాలు, కూరగాయల కోసం జనాలు రోడ్లెక్కుతున్న దృష్ట్యా ఏపీ ప్రభుత్వం తాజాగా మొబైల్ కూరగాయాల రైతుబజార్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎవరూ షాపుల చుట్టూ తిరగకుండా వారి వీధుల్లోకే వాహనాల్లో కూరగాయలను పండించిన రైతుల ద్వారా ప్రజల వద్దకు తీసుకెళ్లేలా ఏర్పాటు చేశారు. ఆటోలు, టాటా ఏస్ వాహనాల్లో ఈ మొబైల్ రైతుబజార్ లను సిద్ధం చేశారు.

కరోనా సోకకుండా ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు - చొరవపై జాతీయ స్థాయిలో ప్రశంసలు కురుస్తున్నాయి. జాతీయ మీడియా సైతం జగన్ ప్రభుత్వం ఐడియాలు గ్రేట్ అంటూ ప్రశంసించడం విశేషం.