Begin typing your search above and press return to search.

బాబూ: జ‌గ‌న్‌ కు ఇలాగేనా భ‌ద్ర‌త‌?

By:  Tupaki Desk   |   18 Oct 2017 3:27 PM IST
బాబూ: జ‌గ‌న్‌ కు ఇలాగేనా భ‌ద్ర‌త‌?
X
వైసీపీ అధ్య‌క్షుడు - విప‌క్ష నేత‌ - పులివెందుల నియోజ‌క‌వ‌ర్గానికి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న వైఎస్ జ‌గ‌న్ భ‌ద్ర‌త విష‌యంలో చంద్ర‌బాబు స‌ర్కారు తీవ్ర నిర్ల‌క్ష్యం చేస్తోంద‌నే విమ‌ర్శ‌లు ఊపందుకున్నాయి. నిజానికి ఆయ‌న‌కు కేబినెట్ హోదా ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌భుత్వం ఎంత‌మాత్ర‌మూ ప‌ట్టించుకోవ‌డంలేదు. పోనీ ప్రోటోకాల్ ప్ర‌కారం చూసుకున్నా విప‌క్ష నేతకు స‌రైన విధంగా భ‌ద్ర‌త‌ - వాహ‌న సౌక‌ర్యం క‌ల్పించాలి. కానీ, బాబు స‌ర్కారు ఎంత‌మాత్ర‌మూ వీటిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌డం లేద‌ని వైసీపీ నేత‌లు పెద్ద ఎత్తున విమ‌ర్శిస్తున్నారు.

విష‌యంలోకి వెళ్తే.. బుధవారం గుంటూరులో జ‌గ‌న్ వివిధ కార్య‌క్ర‌మాలు పెట్టుకున్నారు. దీనికిగాను ఆయ‌న హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ స‌మీపంలోని గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యానికి చేరుకున్నారు. అక్క‌డి నుంచి గుంటూరుకు వెళ్లాల్సి ఉంది. ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వం ఓ పాత‌బ‌డిన బుల్లెట్ ప్రూఫ్ వాహ‌నాన్ని స‌మ‌కూర్చింద‌ని వైసీపీ నేత‌లు ఆరోపించారు. దీంతో వెంట‌నే వారు ఈ వాహ‌నంలో ఏసీ ప‌నిచేయ‌డం లేద‌ని, అప‌రిశుభ్రంగా ఉంద‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు అస‌లేం జ‌రిగిందో కూడా చూడ‌కుండా గుంటూరులో వాహ‌నాన్ని మార్చారు.

పోనీ అక్క‌డైనా మంచి వాహ‌నం ఏర్పాటు చేశారా? అంటే అదీ లేదు. ఇక‌, తిరుగు ప్ర‌యాణంలో ఆ వాహ‌నం మంగళగిరి సమీపంలో పంక్చర్‌ అయింది. దీంతో అధికారులు మ‌రో వాహ‌నాన్ని ఏర్పాటు చేయాల్సి ఉన్న‌ప్ప‌టికీ.. స్పందించ‌క‌పోవ‌డంతో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితిలో.. జ‌గ‌న్ ఓ ప్రైవేట్‌ వాహనంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ నేప‌థ్యంలో వైసీపీ నేత‌లు బాబు వైఖ‌రిపై మండిప‌డ్డారు. ఉద్దేశ పూర్వ‌కంగానే బాబు.. వ్య‌క్తిగ‌త క‌క్ష‌ల‌ను, రాజ‌కీయ దురుద్దేశాల‌ను క‌డుపులో పెట్టుకుని జ‌గ‌న్‌ ని ఇలా న‌డిరోడ్డుపై నిలబెట్టార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కాగా, భవిషత్తులో అయినా మరో మారు ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పార్టీ పోగ్రాం కమిటీ కన్వీనర్‌ తలశిల రఘురాం ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేశారు