Begin typing your search above and press return to search.
అప్పుల ప్రదేశ్ గా ఆంధ్ర
By: Tupaki Desk | 9 Feb 2017 3:15 PM ISTచంద్రబాబు పాలనలో ఆంధ్ర ప్రదేశ్(ఏపీ) నిర్వచనం మారిపోయిందంటున్నాయి విపక్షాలు. ఏపీ అంటే అప్పుల ప్రదేశ్ అన్నట్లుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉందని చెబుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తుంటే ఆ మాట నిజమేనని అర్థమవుతోంది.
నవ్యాంధ్ర ప్రభుత్వం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉండటంతో అన్ని రకాల బిల్లుల చెల్లింపులపై ఆంక్షలు విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేదాకా ఎటువంటి చెల్లింపులను చేయవద్దని అన్ని జిల్లాల్లోని ట్రెజరీ కార్యాలయాలకు సమాచారం ఇచ్చేశారు. సెక్యూరిటీ బాండ్లను రిజర్వు బ్యాంక్ వద్ద తాకట్టు పెట్టి రుణం తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు
తెలుస్తోంది.
రాష్ట్ర బడ్జెట్ 1.34 లక్షల కోట్ల రూపాయలతో రూపొందించినప్పటికీ, ఇప్పటివరకూ దాదాపు లక్ష కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారు. ద్రవ్యలోటు 24వేల కోట్ల రూపాయలకు చేరుకోగా, రెవెన్యూ లోటు దాదాపు 15వేల కోట్ల రూపాయలకు చేరుకుంది. పెద్దనోట్ల రద్దు దెబ్బకు ఆదాయ లక్ష్యాలను 50 శాతానికి మించి అధిగమించలేని పరిస్థితి నెలకొంది. పెద్ద నోట్ల రద్దు కారణంగా దాదాపు 1000 కోట్ల రూపాయల మేరకు ఆదాయం తగ్గినట్లు అంచనా వేస్తున్నారు.
దీంతో 13 జిల్లాల్లోని అన్ని ట్రెజరీల్లో బిల్లులను చెల్లించవద్దని - తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ నిలిపివేయమని ప్రభుత్వం మౌఖిక ఆదేశాలను జారీ చేసింది. బ్యాంక్ లకు పంపిన బిల్లులను సైతం చెల్లించవద్దని చెప్పింది. కాగా ట్రెజరీ చెల్లింపులను నిలిపివేయడం వల్ల వివిధ స్కాలర్ షిప్ లు - ఆసుపత్రులు - సంక్షేమ హాస్టళ్ల మెస్ బిల్లుల చెల్లింపులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ పరిస్థితి మరో ఐదు రోజులు కొనసాగవచ్చని అధికారులు భావిస్తున్నారు. సాధారణంగా మార్చి నెలలో బిల్లుల చెల్లింపులపై ట్రెజరీ ఆంక్షలు ఉంటుంటాయి. కానీ ఈ ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలోనే పరిస్థితి విషమించింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/