Begin typing your search above and press return to search.
బోటు ప్రమాద ప్రాణ దాతలకు..జగన్ ఏమిచ్చారో తెలుసా?
By: Tupaki Desk | 27 Sept 2019 9:39 PM ISTతూర్పు గోదావరి జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న బోటు ప్రమాదంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 37 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో బోటు ప్రమాదం చోటుచేసుకున్న ప్రాంతానికి సమీపంలో ఉన్న కచ్చలూరు గ్రామానికి చెందిన పలువురు యువకులు ప్రాణాలకు తెగించి 26 మందిని బతికించారు. ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలోకి దూకి మరీ ప్రమాదానికి గురైన బోటులోని 26 మంది పర్యాటకులను కాపాడారు. ప్రమాదంలో ఎంత మంది చనిపోయారన్న విషయంపైనే అంతా మాట్లాడుతుంటే... తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టేసి 26 మందిని కాపాడిన కచ్చలూరు వాసుల గురించి మాత్రం పెద్దగా వార్తలే రావడం లేదు. ఇలాంటి నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం... పర్యాటకుల ప్రాణాలను కాపాడిన వారిని రియల్ హీరోలుగానే గుర్తించారు. గుర్తించడంతోనే సరిపెట్టుకోకుండా రియల్ హీరోలుగా నిలిచిన వారికి నగదు పురస్కారాలు ప్రకటించారు.
ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ విషయం వివరాల్లోకి వెళితే... 77 మందితో బయలుదేరిన బోటు... గోదావరి ఉధృతికి బోల్తా పడింది. దీంతో ఒక్కసారిగా బోటులోని టూరిస్టులు హాహారాకాలు చేశారు. ఇది విన్న కచ్చలూరు వాసులు ముందూ వెనుకా చూడకుండా నదిలోకి దూకేసి... తమ చేతికందిన పర్యాటకులను ప్రాణాలతో ఒడ్డుకు చేర్చారు. బోల్తా పడిన వెంటనే బోటు మునిగిపోవడంతో మరింత మందిని కాపాడేందుకు కచ్చలూరు వాసులకు వీలు కాలేదు. అయినా కూడా కచ్చలూరు వాసుల సాహసంతో బోటులోని 26 మంది పర్యాటకులు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ విషయంపై పెద్దగా వార్తలే రాలేదు. అయితే గ్రౌండ్ రిపోర్ట్ ఏమిటన్న విషయాన్ని కూలంకషంగా పరిశీలించిన జగన్ మాత్రం కచ్చలూరు వాసులను రియల్ హీరోలుగానే గుర్తించారు.
అంతేకాకుండా పర్యాటకులను కాపాడిన కచ్చలూరు గ్రామానికి చెందిన వారికి ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున నగదు పురస్కారం అందజేయాలని నిర్ణయించారు. అదే విషయాన్ని జిల్లా కలెక్టర్ కు సూచించిన జగన్... నగదు పురస్కారాలను వీలయినంత త్వరితగతిన అందజేయాలని కూడా జగన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రాణాలకు తెగించి పర్యాటకులను కాపాడటమంటే చిన్న విషయం కాదని - ధైర్య సాహసాలతో కూడిన ఈ చర్యను ప్రతి ఒక్కరు గుర్తించాలని భావించిన జగన్... కచ్చలూరు వాసుల హీరోయిక్ చర్యను రాష్ట్ర ప్రజలకు తెలియజేసే విధంగా నగదు ప్రోత్సాహకాలు అందించేందుకు రంగం సిద్ధం చేశారన్న మాట. అంతేకాకుండా ఇకపై బోటు ప్రమాదాలు జరగకుండా ఉండేలా ఏమేం చర్యలు తీసుకోవాలన్న దిశగానూ అధ్యయనం చేసేందుకు జగన్ అధికార యంత్రాంగానికి అదేశాలు జారీ చేశారట.