Begin typing your search above and press return to search.

బాబు స‌ర్కార్ అప్పుల చిట్టా మామూలుగా లేదుగా!

By:  Tupaki Desk   |   10 March 2019 10:34 AM IST
బాబు స‌ర్కార్ అప్పుల చిట్టా మామూలుగా లేదుగా!
X
డాబుకు లోటు లేన‌ట్లుగా ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తోంది చంద్ర‌బాబు స‌ర్కారు. దేనికైనా.. ఏ అవ‌స‌రానికైనా స‌రే.. అప్పుకు మించిన ప‌ర‌మార్థం లేద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. అది.. ఇది అన్న తేడా లేకుండా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. ఆయ‌న కుమారుడు క‌మ్ మంత్రి నారా లోకేశ్ లు ఇద్ద‌రూ పోటీ ప‌డి మ‌రీ అప్పులు తీసుకొస్తున్న వైనం అంత‌కంత‌కూ పెరుగుతోంది.

కేంద్రం నుంచి వ‌చ్చే నిధులు.. రాష్ట్ర బ‌డ్జెట్ లో కేటాయింపులు స‌రిపోన‌ట్లుగా.. ఎడాపెడా చేస్తున్న అప్పుల చిట్టా అంత‌కంత‌కూ పెరుగుతోంది. ఇలా అప్పులు చేసుకుంటూ పోతే ఏపీ ఫ్యూచ‌ర్ ఏమిట‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మ‌రింత విచిత్ర‌మైన విష‌యం ఏమంటే.. అప్పు తేవ‌టం కోస‌మే కొన్ని మంత్రిత్వ శాఖ‌ల‌కు అనుబంధ శాఖ‌ల్ని ఏర్పాటు చేయ‌టం క‌నిపిస్తుంది.

విచిత్ర‌మైన అంశం ఏమంటే.. గ‌డిచిన ఆర్నెల్ల‌లో అప్పుల జోరు అంత‌కంత‌కూ పెరుగుతోంది. కీల‌క‌మైన ఎన్నిక‌ల ఘ‌ట్టం ముందుకు వ‌చ్చేసిన వేళ‌లో.. ఇష్టం వ‌చ్చిన రీతిలో చేస్తున్న అప్పులు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. లోకేశ్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న గ్రామీణాభివృద్ధి శాఖ విష‌య‌మే తీసుకుంటే.. కేవ‌లం ఏడాది వ్య‌వ‌ధిలో ఆయ‌న నిర్వ‌హిస్తున్న మంత్రిత్వ శాఖ‌కు చెందిన బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పు అక్ష‌రాల రూ.18,850 కోట్లుగా చెబుతున్నారు.

అభివృద్ధి కార్య‌క్ర‌మాల కోసం అప్పులు తెస్తున్న‌ట్లుగా పుస్త‌కాల్లో చూపిస్తున్న ఏపీ స‌ర్కారు.. ఆ నిధుల్ని సంక్షేమ కార్య‌క్ర‌మాలకు వినియోగించ‌టం గ‌మ‌నార్హం. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాదిరి.. బ‌రాబ‌ర్ అప్పు చేస్తామ‌ని తేల్చేసిన ఆయ‌న బాట‌లోనే ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌య‌నిస్తున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అప్పుల్ని తేవ‌టంలో అదిరిప‌డేలా చేస్తున్న చంద్ర‌బాబు.. చిన‌బాబు వ్య‌వ‌హారం ఏపీ ఆర్థిక ప‌రిస్థితిని మ‌రింత కునారిల్లేలా చేస్తుంద‌న్న వాద‌న వినిపిస్తోంది.