Begin typing your search above and press return to search.
ఏపీలో తెలంగాణ నేతపై కేసు
By: Tupaki Desk | 3 Feb 2016 1:44 PM ISTతూర్పుగోదావరి జిల్లా తునిలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో పోలీసులు పలువురిపై కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే... ఇందులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన నేతపైనా కేసు నమోదు చేశారు.
కాపు నేత ముద్రగడ పద్మనాభం ఏర్పాటు చేసిన కాపు గర్జన సభకు వివిధ నేతలు హాజరయ్యారు. అయితే... గర్జన సభ ప్రారంబమైన కొద్ది నిమిషాల్లో అది హింసారూపం దాల్చింది. రైళ్లు - వాహనాలు - పోలీసు స్టేషన్లను ఆందోళనకారులు తగలబెట్టారు. ఆ హింసాకాండను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం అందుకు కారణమైన వారిని గుర్తించి కారకులపై కేసులు పెడుతోంది. అందులో భాగంగా ప్రత్యక్షంగా దాడిలో పాల్గొన్నవారినే కాకుండా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినవారు, ఆ సభకు హాజరైన కొందరు నేతలపై కేసులు నమోదు చసింది. గర్జన నిర్వాహకుడు ముద్రగడ పద్మనాభం సహా బొత్స సత్యనారాయణ - జ్యోతుల నెహ్రూ - కన్నా లక్ష్మీనారాయణ వంటి నేతలపైనా కేసులు పెట్టారు. వీరితో పాటు తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేత వీ. హనుమంతరావుపైనా ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు.
కాపు గర్జన సభకు ఉభయ రాష్ట్రాల్లోని పలువురు కాపు నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్, వైసీపీకి చెందినవారు హాజరై గర్జన సభ నుంచే ఆందోళనకారులు బయలుదేరి హింసకు పాల్పడ్డారు. దీంత సభకు హాజరైన నేతల ప్రమేయంపై ఆదారలు సేకరించిన పోలసీులు అక్కడ వారు చేసిన వ్యాఖ్యలు వంటివి సీరియస్ గా తీసుకున్నారు. దీంతో ఏపీ నేతలతో పాటు తెలంగాణకు చెందిన కాపు నేత వి.హనుమంతరావుపైనా కేసు నమోదు చేశారు.