Begin typing your search above and press return to search.
బాబు ఖాతాలో మరో 120 కోట్లు
By: Tupaki Desk | 9 March 2016 1:36 PM ISTతెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు - ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై పరిపాలన పరమైన సమస్యలు - దుబారా ఖర్చు దాడి పెరిగిపోతోంది. గత ఏడాది జూన్ లో విజయవాడను పరిపాలన రాజధానిగా చేసిన తర్వాత ఇటు హైదరాబాద్ అటు విజయవాడ మధ్య చంద్రబాబుతో పాటు ఉన్నతాధికారులు చక్కర్లు కొట్టక తప్పడం లేదు. ఈ క్రమంలో తాజాగా ఆయన దుబారా ఖర్చు చేస్తున్నారంటూ వార్తకథనం వెలువడింది.
ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సారథ్యంలోని సాక్షి మీడియాలో అమరావతి భూములపై ఆరోపణలు మొదలైన సంగతి తెలిసిందే. తాజాగా తాత్కాలిక రాజధాని వల్ల డబ్బులు నీళ్లల ఖర్చయ్యాయని కొత్త కథనం రాసింది. చంద్రబాబు సహా ఉన్నతాధికారులు హైదరాబాద్ టు విజయవాడకు సమావేశాలంటూ, కార్యక్రమాల పేరుతో చుట్టేయడం వల్ల రూ. 120కోట్లు ఖర్చు అయిందని సాక్షి రాసింది. వీటివల్ల దక్కిన ప్రయోజనం కూడా తక్కువేనంటూ తేల్చేసింది.
ఇదిలాఉండగా టీఏ, డీఏ పేరుతో చూపిన రూ.120 కోట్లు కాకుండా చంద్రబాబు మొత్తం దుబారా ఖర్చు 735కోట్ల రూపాయలని సాక్షి పేర్కొంది. వివిధ పర్యటనల కోసం ప్రత్యేక విమానాలు వాడటం మరో 30 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయని ఆరోపించింది. అమరావతి డాక్యుమెంట్లు తయారుచేసే విదేశీ కన్సల్టెంట్లకు 150కోట్లు కట్టబెట్టారంటూ విమర్శించింది. వీటితో పాటు అమరావతి ఖర్చు - ప్రత్యేక బస్సు - వివిధ టూర్ల సందర్భంగా అయిన మొత్తం ఖర్చు రూ.750 కోట్ల వరకు చేరిపోతుందని మండిపడింది.