Begin typing your search above and press return to search.

ఢిల్లీ ఎఫెక్ట్: లెక్క తేల్చుతోన్న జగన్ సర్కార్

By:  Tupaki Desk   |   2 April 2020 9:30 AM GMT
ఢిల్లీ ఎఫెక్ట్: లెక్క తేల్చుతోన్న జగన్ సర్కార్
X
మొన్నటిదాకా సేఫ్ గా ఉన్న ఏపీ ఇప్పుడు ఢిల్లీ మర్కాజ్ ప్రార్థనలతో ఒక్కసారిగా కరోనా కల్లోలానికి గురైంది. ఢిల్లీకి ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారికి పెద్ద సంఖ్యలో కరోనా సోకడంతో కేసుల్లో ఏకంగా తెలంగాణను దాటేసింది. ఢిల్లీలోని నిజాముద్దీన్ లో జరిగిన ప్రార్థనలు ఏపీ కొంప ముంచాయి. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్యను సెంచరీ దాటించాయి.

ఏపీ ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. ఢిల్లీకి మత ప్రార్థనల్లో పాల్గొని రాష్ట్రానికి వచ్చిన వారిని గుర్తించడంలో విజయం సాధించింది. మొత్తం 1100 మందికి పైగా స్థానికులు ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లి స్వస్థలాలకు చేరుకున్నట్టు తెలిసింది. ఇందులో ఇప్పటివరకు 758మందిని గుర్తించారు. వారందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక వారే కాదు.. వారి కుటుంబ సభ్యులు - బంధు మిత్రులకు కూడా రక్త పరీక్షలు చేస్తున్నారు.

ఈ ఢిల్లీకి వెళ్లివచ్చిన వారితో దాదాపు 543మంది సన్నిహితంగా మెలిగారని.. వారందరికీ కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

ఢిల్లీకి వెళ్లొచ్చిన వారిలో ఒక్క గుంటూరు జిల్లాకు చెందిన వారే 200 మంది ఉన్నారని అధికారులు తేల్చారు. కేవలం 4 జిల్లాలకు చెందిన వారే 748మంది ఉన్నట్టు గుర్తించారు. తూర్పు గోదావరి 110 - నెల్లూరు 110 - ప్రకాశం 82 - పశ్చిమ గోదావరి 60 - కడప 59 - అనంతపురం 37 - చిత్తూరు 32 - కృష్ణా 19 - కర్నూలులో 15 - తూ.గోదావరి 16 - విశాఖ 23 - శ్రీకాకుళం 26 - విజయనగరం 7 ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది.

వీరందరికీ వైద్య పరీక్షలు చేయనున్నారు. దీంతో కరోనా కేసుల సంఖ్య ఏపీలో మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.