Begin typing your search above and press return to search.

ఏపీ మందుబాబుల గోస తీరబోతోంది!

By:  Tupaki Desk   |   8 Aug 2020 10:30 AM GMT
ఏపీ మందుబాబుల గోస తీరబోతోంది!
X
ఏపీలో మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తున్న జగన్ సర్కార్ మందుబాబులకు షాకిచ్చేలా నిర్ణయాలు అమలు చేసింది. రాత్రి 8 గంటలకే మందును బంద్ చేసింది. సర్కారీ వైన్ షాపుల్లో కొన్ని రకాల బ్రాండ్ మద్యమే ఉంచింది. మధ్య ధరలను విపరీతంగా పెంచేసి నడ్డి విరిచింది. దీనిపై జనాల్లో ఆగ్రహావేశాలు బాగానే ఉన్నాయని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే మందుబాబులకు గుడ్ న్యూస్ చేప్పేలా జగన్ సర్కార్ అడుగులు వేస్తోంది. లాక్ డౌన్ తర్వాత భారీగా పెంచిన మద్యం ధరలను తగ్గించేందుకు రెడీ అవుతున్నట్టు తెలిసింది.

మద్యం ధరలపై రాష్ట్ర ప్రభుత్వం పున: సమీక్షించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అన్నింటి ధరలు కాకపోయినా పేదల కోసం చీప్ లిక్కర్ ధరలను మాత్రం తగ్గించడానికి యోచిస్తోందని సమాచారం.

మద్యం ధరలు భారీగా పెరగడం.. లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయిన పేదలు శానిటైజర్ తాగుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్న సంఘటనలు ఏపీలో చోటుచేసుకున్నాయి. మరోవైపు పక్క రాష్ట్రాల నుంచి చీప్ మద్యం ఏపీకి పెద్ద ఎత్తున తరలివస్తోంది. ఈ క్రమంలోనే మద్యం ధరలను తగ్గించాలని ప్రభుత్వం డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లోనే ఈ ప్రకటన వెలువడవచ్చని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది.