Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్: ఏపీ షట్ డౌన్ ...!

By:  Tupaki Desk   |   18 March 2020 12:02 PM GMT
కరోనా ఎఫెక్ట్: ఏపీ షట్ డౌన్ ...!
X
భారతదేశంలో కరోనా విజృంభిస్తుండడంతో దేశంలోని అన్ని రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. దేశంలో 147 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో భారతదేశంలో కరోనా వైరస్‌ ను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు పక్కా ప్రణాళికలు రచించి అమలు చేస్తున్నాయి. కాగా , కరోనా తెలుగు రాష్ట్రాలలో కూడా వేగంగా విస్తరిస్తుంది. ఇప్పటివరకు తెలంగాణ లో ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా - ఏపీలో ఒక్క కేసు నమోదు అయ్యింది. అయితే , రోజురోజుకి కరోనా భాదితులు ఊహించని విదంగా పెరిగిపోతున్నారు. దీనితో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఆంధ్రప్రదేశ్ లోని అన్ని విద్యాసంస్థలకు రేపటి నుండి సెలవులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యూనివర్సిటీలు - కళాశాలలు - పాఠశాలలు - కోచింగ్ సెంటర్లతో సహా అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చి రోజులు గడుస్తున్నా కూడా - కరోనా కి మందు కనిపెట్టలేదు. దీనితో ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా పెద్ద మొత్తంలో ఒక చోట ప్రజలు గుమ్మిగూడకుండా చూస్తున్నారు. ఈ కరోనా వైరస్ ప్రభావంతో ఇప్పటికే తెలంగాణ గోవా - రాజస్థాన్ - బీహార్ - పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు సెలవులను ప్రకటించాయి. కర్ణాటకలో మార్చి 31 వరకు మాల్స్ - ధియేటర్లు బంద్ చేశారు. పెళ్లిళ్లు - పబ్లిక్ ఫంక్షన్లు కూడా నిర్వహించవద్దని సూచించారు. కరోనా వైరస్ ప్రభావంతో ఇప్పటివరకు భారత్‌ లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.