Begin typing your search above and press return to search.

తీవ్ర జ్వరం..తెలుగు యువతిని చైనాలోనే వదిలేశారు

By:  Tupaki Desk   |   3 Feb 2020 9:21 AM GMT
తీవ్ర జ్వరం..తెలుగు యువతిని చైనాలోనే వదిలేశారు
X
కరోనా వైరస్ కారణంగా చైనాలోని వూహాన్ నుంచి ఇతర దేశాల వారిని ఆయా దేశాలు తరలిస్తున్నాయి. వుహాన్ లో చిక్కుకున్న భారతీయులను సైతం భారత ప్రభుత్వం రెండు విమానాల్లో ఇండియాకు తీసుకొచ్చింది. అయితే అన్నెం శృతి, సత్యసాయి కృష్ణ అనే ఇద్దరు తెలుగు యువతి, యువకుడు మాత్రం చైనాలో చిక్కుకుని పోయారు.

కర్నూలు జిల్లాకు చెందిన ఈ యువతి శృతి తోపాటు సాయికృష్ణ సైతం పీఓటీపీఎల్ కంపెనీ లో పనిచేస్తున్నారు. శిక్షణ నిమిత్తం గత ఏడాది ఆగస్టు లో తిరుపతి నుంచి 60మంది ఉద్యోగులతో కలిసి చైనా వెళ్లారు. .చైనాలో కరోనా వైరస్ విజృంభించడంతో అక్కడ ఉన్న భారతీయులందరినీ కేంద్రం స్వదేశానికి తీసుకొస్తోంది. రెండు ప్రత్యేక విమానాలను నడిపి తీసుకొచ్చింది.

అయితే ఇండియాకు బయలు దేరిన అన్నెం శృతిని మాత్రం భారతీయ విమానం ఎక్కనివ్వలేదు. దీనికి కారణం గా ఆమెకు 90డిగ్రీల జ్వరం ఉండడమే. కరోనా వైరస్ లక్షణాలు ఉండవచ్చన్న కారణంతో ఆమెను భారత విమానం ఎక్కనివ్వకుండా అక్కడే దించేశారు.

తనతోపాటు సాయికృష్ణ అనే మరో వ్యక్తి చిక్కుకొని ఉండి పోయామని.. తిండి మందులు ఇవ్వడం లేదని సదురు యువతి వాపోయింది. ఈ మేరకు కర్నూలు జిల్లా కోయిలకుంట్ల మండలం బీజన వేములలో ఉంటున్న తల్లిదండ్రులకు వాట్సాప్ లో వీడియో సందేశం పంపి బోరుమంది.

కాగా అన్నెం శృతికి ఈనెల 14న మహానంది మండలి తమ్మడపల్లెకు చెందిన యువకుడితో వివాహం నిశ్చయం కావడం గమనార్హం. పెళ్లి దగ్గర పడుతున్న సమయంలో శృతి చైనా లో చిక్కుకొని పోవడం తో ఆమె తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి వెంటనే తమ కుమార్తెను దేశానికి రప్పించాలని శృతి తల్లిదండ్రులు కోరుతున్నారు.