Begin typing your search above and press return to search.

అంకెల్లో ఏపీ బడ్జెట్ ను చూస్తే.. 1

By:  Tupaki Desk   |   10 March 2016 3:31 PM GMT
అంకెల్లో ఏపీ బడ్జెట్ ను చూస్తే.. 1
X
మరో బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న యనమల ప్రవేశ పెట్టిన ఏపీ బడ్జెట్ లో వివరాలకు కొదవ లేదు. కాకుంటే.. ఆయన చేసిన 2.05 గంటల పాటు సాగిన బడ్జెట్ ప్రసంగాన్ని జాగ్రత్తగా విన్న తర్వాత.. ఏపీ బడ్జెట్ గురించి ఏదైనా చెప్పు బాస్ అని ఎవరైనా అడిగితే.. బేల ముఖం పెట్టటం మినహా ఏమీ చేయలేని దుస్థితి. ఎందుకంటే.. చెప్పేందుకు ఏమీ లేకపోవటం.. చెప్పిన వివరాలు.. విశేషాలన్నీ అంకెల్లో నిండిపోవటం.. ఏ విషయానికి తమ ప్రభుత్వ ప్రాధాన్యత అన్న విషయాన్ని చెప్పే దిశగా బడ్జెట్ పాఠాన్ని తయారు చేసుకోవటం.. వెరసి బడ్జెట్ ను లెక్కలేనన్ని అంకెల్లో నింపేశారు. సింఫుల్ గా చెప్పాలంటే.. ఏపీ ఇరగదీస్తుందని చెప్పిన ఆయన.. కేంద్రం నుంచి సాయం అందలేదన్న విషయాన్ని తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పేశారు.

సంక్షేమం మీద ఎక్కువ ఫోకస్ చేసిన ఆయన.. కీలకమైన పలు అంశాలకు జరిపిన కేటాయింపులు చాలా స్వల్పంగా ఉండటం గమనార్హం. రూ.1.35లక్షల కోట్ల బడ్జెట్ లో కీలకమైన సాగునీటి ప్రాజెక్టులకు 7వేల కోట్లు.. రుణమాఫీకి రూ.3.5వేల కోట్లు.. ఆరోగ్యానికి రూ.2.2వేల కోట్లు.. గృహ నిర్మానానికి రూ.1.13వేల కోట్లు మాత్రమే కేటాయించటం గమనార్హం. అదే సమయంలో ఏపీకి ఎంతో కీలకమైన అమరావతి నిర్మాణం కోసం రూ.1500 కోట్లు కేటాయిస్తే.. పాఠశాల విద్యకు ఏకంగా రూ.17,502 కోట్లు కేటాయించటం విశేషం. మొత్తంగా యనమల బడ్జెట్ ను చూస్తే.. సంక్షేమానికి పెద్దపీట వేయటం.. మౌలిక సదుపాయాలు.. పరిశ్రమలు.. ఉపాది కల్పన మీద ఎక్కువ ఫోకస్ చేసిన విషయం అర్థమవుతుంది. విభజన కారణంగా ఏపీకి జరిగిన నష్టాన్ని కింది స్థాయి నుంచి సమూలంగా మార్పులు చేసేందుకు.. బలమైన పునాది వేసేందుకు యనమల కసరత్తు చేసినట్లుగా కనిపిస్తుంది.

గత బడ్జెట్ తో పోలిస్తే.. ప్రణాళికా వ్యయం.. ప్రణాళికేతర వ్యయం పెరిగినట్లు కనిపిస్తుంది. అదే సమయంలో.. భారీగా ప్రణాళికేతర వ్యయం మొత్తాన్ని చూస్తేనే ఏపీ పరిస్థితి ఏమిటన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. ఇక.. ఆర్థిక లోటు అంకెను చూసినప్పుడు ఏపీ పరిస్థితి ఎప్పటికి సర్దుకునేనన్న సందేహం కలగటం ఖాయం.

ఇక.. ఏపీబడ్జెట్ ను అంకెల్లో చూస్తే..

= బడ్జెట్ వ్యయం రూ.1,35,688 కోట్లు

= ప్రణాళికేతర వ్యయం రూ.86,584 కోట్లు

= ప్రణాళికా వ్యయం రూ. 49,134కోట్లు

= ఆర్థిక లోటు రూ. 20,497 కోట్లు

= రెవెన్యూ లోటు రూ.4,868 కోట్లు

= వృద్ధిరేటు లక్ష్యం 10.9 శాతం

ప్రధాన కేటాయింపులు

= వ్యవసాయం.. పాడి పరిశ్రమ.. అడవులు అనుబంధ రంగాలకు రూ.16,490కోట్లు

= ప్రజాపంపిణీ వ్యవస్థకు రూ.2702.20 కోట్లు

మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి : అంకెల్లో ఏపీ బడ్జెట్ ను చూస్తే.. 2