Begin typing your search above and press return to search.

లక్కీ లింగాయపాలెం

By:  Tupaki Desk   |   24 Aug 2015 4:19 PM IST
లక్కీ లింగాయపాలెం
X
నవ్యాంధ్ర రాజధానిలో లింగాయపాలేనికి ఇప్పుడు ప్రత్యేకత ఉంది. ఆ గ్రామం అద్భుతంగా అభివృద్ధి చెందబోతోంది. అమరావతిలో తొలి ఫలం తుళ్లూరు మండలంలోని లింగాయపాలేనికే దక్కనుంది. దీనినియథాతథంగా ఉంచడంతోపాటు మాస్టర్ ప్లాన్ తో అనుసంధానం చేస్తారు. ప్రభుత్వ భవనాలతోపాటు 26 వేల మంది జనాభా లింగాయపాలెం పరిధిలో నివాసం ఉండేందుకు వీలుగా భవన నిర్మాణాలు చేపడతారు. ఇక్కడే 45 వేల ప్రభుత్వ ఉద్యోగాలు, 50 వేల ప్రభుత్వేతర ఉద్యోగాలను కల్పించనున్నారు.

ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ కార్యకలాపాలు ఉండే ప్రభుత్వ కోర్ మొత్తం లింగాయపాలెంలోనే కేంద్రీకృతం కానుంది. కృష్ణా నదికి ఒడ్డున ఉండడంతో ప్రభుత్వ కేంద్రంగా ఈ గ్రామాన్ని ఎంచుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మాస్టర్ ప్లాన్ లో కూడా దీనికే పెద్దపీట వేసింది. ఈ గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న భూముల్లోనే అసెంబ్లీ, సచివాలయం, మంత్రుల నివాసాలు, హైకోర్టు, పరిపాలనా కార్యాలయాలు, ఆస్పత్రులు, సివిక్ ప్లాజా తదితరాలు నిర్మిస్తారు. దీనికంటే ముందు సీడ్ కేపిటల్ ప్రాంతం మీదుగా టౌన్ టౌన్ రోడ్డు నిర్మిస్తారు. దీని ద్వారానే రాజధాని నిర్మాణాకికి అవసరమైన యంత్ర సామగ్రిని తరలిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే రాజధాని నిర్మాణానికి ఇది పునాది. దీనితో లింగాయపాలెం దశ కూడా తిరగనుంది.