Begin typing your search above and press return to search.
వాళ్లంతా వైసీపీకే ఓటేశారట..కామెడీగా!
By: Tupaki Desk | 24 Dec 2019 12:50 PM ISTరాజధాని ప్రాంతంలో నిరసన తెలుపుతున్న వాళ్లు ఒక కామన్ డైలాగ్ పట్టుకున్నారు. అదేమిటంటే.. తాము వైసీపీకి ఓటేశాము అనేది! అధికార పార్టీని బ్లాక్ మెయిల్ చేయడానికి ఈ డైలాగ్ బాగా ఉపయోగపడుతుందనేది గ్రహించినట్టుగా ఉన్నారు ఈ ధర్నా వాళ్లు. అందుకే దాన్ని తెగ వాడేస్తున్నారని స్పష్టం అవుతోంది.
వాస్తవానికి రాజధాని పేరిట భూ సేకరణ చేసినప్పుడు అనేక మంది రోడ్డు ఎక్కారు. తమ భూములను ప్రభుత్వం లాగేసుకుంటోందని - తాము భూములు ఇవ్వదలుచుకోలేదని వారు వాపోయారు. ఎన్నికల ముందు వరకూ కూడా అలాంటి వ్యవహారాలు సాగాయి. రాజధాని కి భూములు ఇవ్వడం ఇష్టం లేదంటూ అనేక మంది రైతులు అప్పుడు రోడ్డెక్కారు.
వైఎస్ షర్మిల అలాంటి వారితో ఒక సమావేశం కూడా నిర్వహించారు. తమకు రాజధాని వద్దని - తమకు భూములు మిగిలితే చాలని వాపోయారు. తాము అధికారంలోకి వస్తే.. ఎవరితోనూ బలవంతపు భూ సేకరణ చేయమని వైఎస్ జగన్ అప్పుడే స్పష్టం చేశారు. రాజధానికి అదనపు భూ సేకరణ ఉండదు - ఇష్టం లేని రైతుల నుంచి తీసుకున్న భూములను వెనక్కు ఇచ్చేస్తామంటూ జగన్ ప్రకటించారు కూడా.
ఇక రాజధాని విషయంలో జగన్ మూడు ప్రాంతాలకు సమ్మతమయ్యే ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. దీని ద్వారా అభివృద్ధి అనేది ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా.. అన్ని ప్రాంతాలకూ ఉపయుక్తం గా ఉంటుంది. అయితే తాము త్యాగాలు చేశామంటూ.. రాజధాని తరలించకూడదని అంటూ కొంతమంది వాదిస్తున్నారు. వాళ్ల కోసం అన్ని ప్రాంతాల వాళ్లూ త్యాగం చేయాలన్నట్టుగా వారు మాట్లాడుతూ ఉన్నారు. ఏ మాత్రం హేతుబద్ధంగా లేదు వారి వాదన. ఇప్పుడు రాజధాని విషయంలో వారికి వచ్చి నష్టం లేదు. సెక్రటేరియట్ - అసెంబ్లీ తదితరాలు అక్కడే ఉంటాయి. ఇంకా ఎలాగూ జరిగే డెవలప్ మెంట్ జరుగుతుంది. అయితే అంతా తమకే కావాలన్నట్టుగా కొంతమంది మాట్లాడుతూ ఉండటం.. ఇతర ప్రాంతాల్లో అసహనాన్ని పుట్టిస్తోంది సుమా!