Begin typing your search above and press return to search.

నాలుగు గంట‌ల క్యాబినెట్‌ చ‌ర్చ సారాంశ‌మేంటి..?

By:  Tupaki Desk   |   22 July 2015 11:59 AM GMT
నాలుగు గంట‌ల క్యాబినెట్‌ చ‌ర్చ సారాంశ‌మేంటి..?
X
నాలుగు గంట‌ల పాటు సాగిన ఏపీ మంత్రి వ‌ర్గ స‌మావేశం ముగిసింది. ఈ సంద‌ర్భంగా ప‌లు అంశాల‌పై విస్తృతంగా చ‌ర్చ జ‌రిగింది. పుష్క‌రాల ఏర్పాట్ల‌పై సంతృప్తి వ్య‌క్తం చేయ‌టంతో పాటు.. మంత్రివ‌ర్గంలోని ప‌లువురు ముఖ్య‌మంత్రి ప‌ని తీరును ప్ర‌శంసిస్తూ మాట్లాడార‌ని చెబుతున్నారు. చాలా బాగా క‌ష్ట‌ప‌డ్డార‌ని.. ప్ర‌జ‌లు పాజిటివ్ గా ఉన్నార‌ని చెప్పినట్లుగా తెలుస్తోంది. రాజ‌మండ్రి ఘ‌ట‌న‌ను దుర‌దృష్ట‌క‌ర ఘ‌ట‌న‌గా త‌మ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తూనే.. విప‌క్షాలు రాజ‌కీయం చేశార‌న్న మాట‌ను మంత్రులు ప్ర‌స్తావించిన‌ట్లుగా చెబుతున్నారు. ఇక‌.. కాబినెట్ నిర్ణ‌యాల విష‌యానికి వ‌స్తే..

- పుష్క‌రాల ముగింపు సంద‌ర్భంగా ఈ నెల 25న ప్ర‌తి ఇంట్లో దీపారాదన చేయాలి
- రాజ‌మండ్రి తొక్కిస‌లాట మృతుల‌కు సంతాపం.
- కర్నూలు జిల్లాలో డీఆర్‌డీవోకు 2,200 ఎకరాల కేటాయింపు
- సింగపూర్‌ బృందం ఇచ్చిన రాజధాని నగర బృహత్‌ ప్రణాళికకు ఏకగ్రీవ ఆమోదం.. ధన్యవాదాలు
- రాజధాని నిర్మాణానికి స్విస్‌ ఛాలెంజ్‌ పద్ధతిలో పాలు పంచుకోవాలని జపాన్‌, సింగపూర్‌ దేశాలకు పిలుపు ఇవ్వాలని నిర్ణయం
- రాజ‌ధానుల ప‌రిశీల‌న‌కు ప్ర‌ధాని సూచ‌న నేప‌థ్యంలో కజకిస్థాన్‌, తెర్కెమెనిస్థాన్‌ దేశాల్లోని రాజ‌ధాని న‌గరాల్లో ప‌ర్య‌టించాల‌ని నిర్ణ‌యం
- 2018 నాటికి రాజధాని తొలిదశ పనులు పూర్తిచేయాలని నిర్ణయం
- వీలైనంత త్వరగా ప్రభుత్వ శాఖలన్నీ విజయవాడకు తరలివచ్చేలా ఏర్పాట్లు చేయాలి
- పురపాలక సమ్మెపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం
- 2014 ఖరీఫ్‌ కాలానికి రూ.690 కోట్ల పెట్టుబడి రాయితీ విడుదలకు ఆమోదం
- అనంతపురం నకిలీ పాస్‌పుస్తకాల కేసుపై మంత్రివర్గం ఆగ్రహం, అన్ని జిల్లాల్లోనూ సమగ్ర విచారణ జరపాలని నిర్ణయం
- తహసీల్దార్‌ వనజాక్షి, ఎమ్మెల్యే చింతమనేని మధ్య ఇసుక వివాదంపై చర్చ. తహసీల్దార్‌ పరిధి దాటార‌న్న అభిప్రాయం(?)
- భవన నిర్మాణాల క్రమబద్ధీకరణపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు
- రాష్ట్రంలో 80 గజాలలోపు ఉన్న అక్రమ కట్టడాలను ఉచితంగా క్రమబద్ధీకరణ‌కు నిర్ణయం
- పుష్కరాల నిర్వహణలో బాగా పనిచేసిన వారికి ఈ 26న పురస్కారాలు ప్రదానం
- పోలవరం కుడికాలువ పనులు వేగంగా పూర్తి చేయాలి