Begin typing your search above and press return to search.

​ఏపీలో ఒకేసారి 25 వేల ప్రభుత్వ ఉద్యోగాలు​

By:  Tupaki Desk   |   3 March 2016 4:36 AM GMT
​ఏపీలో ఒకేసారి 25 వేల ప్రభుత్వ ఉద్యోగాలు​
X
ఏపీ మంత్రివర్గం మరికొన్ని నిర్ణయాల్ని తీసుకుంది. బుధవారం సమావేశమైన ఏపీ క్యాబినెట్.. ఎప్పటి మాదిరి సుదీర్ఘంగా చర్చలు జరిపి పలు నిర్ణయాల్ని తీసుకుంది. ఇటీవల ప్రకటించిన ఉచిత ఇసుక నిర్ణయానికి క్యాబినెట్ ఆమోదముద్ర పడింది. దీంతో పాటు మరిన్ని నిర్ణయాల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ మంత్రివర్గం పలు నిర్ణయాలు తీసుకుంది. అవేమంటే..

= రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన 157 ఇసుక రీచ్ లలో ఎంతమేర తవ్వకాలు చేపట్టాలన్న అంశంపై త్వరలోనే ప్రమాణాలు నిర్దేశించనున్నారు. వంతెనలు.. రిజర్వాయర్లు తదితర నోటిఫైడ్ ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు చేపట్టానికి వీల్లేకుండా చేస్తారు. అదే విధంగా ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలింపు.. అక్రమ నిల్వలపై నిషేధం ఉంటుంది. ఉల్లంఘనలకు పాల్పడే వారికి నిత్యావసర వస్తువుల చట్టాన్ని ప్రయోగించి కఠినంగా చర్యలు తీసుకుంటారు.

= విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయ చట్టంలో మార్పు చేయటం ద్వారా.. వర్సిటీ కులపతిగా హైకోర్టు చీఫ్ జస్టిస్ నియమించాలన్న ప్రతిపాదన. ఇక.. వర్సిటీ సీట్ల ప్రవేశంలో 50 శాతం సీట్లను ఏపీ వారికి.. మిగిలిన 40 శాతం సీట్లు ఇతర రాష్ట్రాల వారికి.. 10 శాతం సీట్లు ఎన్ ఆర్ ఐలకు.. విదేశీ విద్యార్థులకు ఇస్తారు.

= ఇనిస్టిట్యూట్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్.. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్.. ఆంధ్రప్రదేశ్ సాంకేతిక శాఖలు సంయుక్తంగా తిరుపతిలో అంతర్జాతీయ స్థాయి ఇంక్యూబేషన్ కేంద్రం ఏర్పాటు

= రా​ష్ట్రంలో​ వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల్ని గుర్తించి.. తొలి విడతలో 25వేల ఉద్యోగాలకు సంబంధించి ఒకేసారి ఉద్యోగ ప్రకటన

= ఆంధప్రదేశ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ విధానానికి ఆమోదముద్ర