Begin typing your search above and press return to search.
బీచ్ సిటీలో బడ్జెట్ సమావేశాలు
By: Tupaki Desk | 7 Aug 2015 6:13 PM IST వచ్చే ఏపీ బడ్జెట్ సమావేశాలను హైదరాబాద్ లో నిర్వహించరా... అలా అయితే ఎక్కడ నిర్వహిస్తారు.. కొత్త రాజధాని అమరవాతిలోనా... లేదంటే దానికి సమీపంలోని విజయవాడలోనా.. కాదంటే ఇంతకుముందు స్పీకర్ కోరుకున్నట్లుగా గుంటూరులోనా... ? టీడీపీలో కొద్ది రోజులుగా ఈ అంశం చర్చనీయంగా ఉంది.. ఎక్కడ నిర్వహిస్తారన్ని తేల్చకపోయినా వచ్చే బడ్జెట్ సమావేశాలు మాత్రం హైదరాబాద్ లో జరగవని చాలామంది చెబుతున్నార. తాజాగా దానిపై కొంత క్లారిటీ వచ్చింది. వచ్చే బడ్జెట్ సమావేశాలను విశాఖపట్నంలో నిర్వహించాలని ప్రభత్వం యోచిస్తున్నట్టు శాసన సభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పడంతో ఈ విషయంలో స్పష్టత వచ్చింది.
అయితే... ఇది ఆలోచన మాత్రమేనని... స్పీకర్‌తో చర్చించిన తరువాతే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని యనమల చెప్పారు. కాగా గతంలో తాను కోరుకున్నట్లుగా గుంటూరులో నిర్వహించకపోవడంతో ఇప్పుడు స్పీకర్ విశాఖకు ఓకే అంటారా లేదంటే గుంటూరులో నిర్వహించాలంటారా చూడాలి. ఒకవేళ విశాఖలోనే జరిగితే ఆంధ్రయూనివర్సిటీలో జరగొచ్చని భావిస్తున్నారు. ఇదే జరిగితే ఉత్తరాంధ్రకు అరుదైన అవకాశం దక్కినట్లవుతుంది.