Begin typing your search above and press return to search.

చంద్రబాబు ‘ఓటుకు నోటు’ కేసుపై కీలక పరిణామం?

By:  Tupaki Desk   |   17 Jun 2017 2:25 PM GMT
చంద్రబాబు ‘ఓటుకు నోటు’ కేసుపై కీలక పరిణామం?
X
తెలుగుదేశం పార్టీ  - భారతీయ జనతా పార్టీల మధ్య పైకి అంతా బాగున్నట్టుగానే కనిపిస్తున్నా, లోలోపల మాత్రం వేరే వ్యవహారం ఒకటి నడుస్తోందని వేరే చెప్పనక్కర్లేదు. తెలుగుదేశం పార్టీతో తెగదెంపులు చేసుకుందాం.. అనే వాయిస్ బీజేపీలో గట్టిగానే ఉంది. అయితే అది బయటపడకుండా కవర్ చేస్తున్నారు బీజేపీలోని కొంతమంది పెద్దలు. తెలుగుదేశం పార్టీతో పొత్తు వద్దు.. సొంతంగా పోటీ చేద్దాం, తద్వారా క్యాడర్ కు కొత్త ఉత్తేజం వస్తుంది, పార్టీకి పునాదులు ఏర్పడతాయి.. అని కొందరు బీజేపీ నేతలు అంటుంటే, అదే పార్టీలోని కొందరు నేతలు మాత్రం తెలుగుదేశంతో సన్నిహిత సంబంధాలే ఉండేందుకు తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.

అయితే వారిని చూసి మిగతా వాళ్లు ఊరికే ఉండటం లేదు. తెలుగుదేశంతో తెంపడానికి వారు శతథా ప్రయత్నిస్తున్నారు. మరి క్షేత్రస్థాయికి వెళ్లి చూస్తే.. తెలుగుదేశం పార్టీ వాళ్లు భారతీయ జనతా పార్టీ క్యాడర్ ను తొక్కేయడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదని చెప్పనక్కర్లేదు. పల్లెల్లో వైకాపా అనే పేరు చెబితే అయినా తెలుగుదేశం అంతో ఇంతో విలువ ఇస్తుందికానీ, బీజేపీ అంటే మాత్రం అంతే సంగతులు.

అధికార కూటమిలో భాగస్వామ్యులు అనే మాటే కానీ.. కమలం పార్టీ నేతల పరిస్థితి దయనీయంగానే ఉంది. మరి ఈ క్రమంలో ఈ పరిస్థితిని గురించి అధిష్టానానికి వివరించడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు. కానీ మూడేళ్ల నుంచి వీరి బాధను ఢిల్లీకి వివరించలేకపోతున్నారు. అయితే తాజాగా బీజేపీలోని కొంతమంది నేతలకు మోడీ అపాయింట్ మెంట్ లభించినట్టు సమాచారం.

ఏపీలో బీజేపీ నేతల - కార్యకర్తల పరిస్థితి దయనీయంగా ఉందని.. తమకు ఎలాంటి ప్రాధాన్యతా దక్కడం లేదని.,. క్యాడర్ కు ఏ పనులూ చేసి పెట్టలేకపోతున్నామని, తెలుగుదేశం పార్టీ బీజేపీ పాలిట నియంతగా మారిందని వీరు పరిస్థితిని ప్రధానికి వివరించారట. అయితే తెలుగుదేశం ప్రయోజనాలే ముఖ్యం అనుకునే కొందరు నేతలున్నారని.. వారి వల్ల బీజేపీకి మరింత నష్టం జరుగుతోందని కూడా చెప్పినట్టు సమాచారం.

బాబును కంట్రోల్ చేయాలని.. బీజేపీ స్థితి మెరుగుపడాలంటే అదే మార్గం అని వీరు ప్రధానికి స్పష్టం చేసినట్టు సమాచారం. ఈ సందర్భం గా ఓటుకు నోటు కేసు కూడా ప్రస్తావనకు వచ్చినట్టుగా తెలుస్తోంది. బాబును కంట్రోల్ చేయడానికి అంతకు మించిన మార్గం లేదని వీరు మోడీ చెవిన ఊదారని తెలుస్తోంది. బాబును నియంత్రించాల్సిందే.. ఎలాగూ ఆయన మెడకు ఆ కేసు ఉంది కాబట్టి.. దాన్ని పట్టుకుని లాగితే తప్ప బీజేపీకి ఏపీలో శరణు లేదని కమలనాథులు మోడీకి స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉన్నా లేకపోయినా.. ఓటుకు నోటు కేసును మరింత ముందుకు తీసుకెళ్లాలని.. అప్పుడే బాబు ను లొంగదీసుకోవడం సాధ్యం అవుతుందనేది వీరు మోడీకి చెప్పిన విషయం గా తెలిసింది.

తమ వాదనను మోడీ సావధానంగా విన్నాడని.. అతి త్వరలో ఓటుకు నోటు కేసులో కీలక పరిణామాలు సంభవించే అవకాశం ఉందని ఢిల్లీ వెళ్లొచ్చిన కమలనాథులు గట్టిగా చెబుతున్నారు!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/