Begin typing your search above and press return to search.

బీజేపీ కొత్త రాష్ట్ర కమిటీ.. సోము వీర్రాజు మార్క్

By:  Tupaki Desk   |   13 Sept 2020 10:00 PM IST
బీజేపీ కొత్త రాష్ట్ర కమిటీ.. సోము వీర్రాజు మార్క్
X
ఏపీ రాజకీయాల్లో దూకుడుగా ముందుకెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అదే ఊపులో రాష్ట్ర కొత్త కార్యవర్గాన్ని ప్రకటించారు. 2024లో అధికారమే లక్ష్యంగా బలమైన నేతలకు చోటు కల్పించారు. కొత్త టీంలో సోము వీర్రాజు ఎంపిక చేసిన వారికే ప్రాధాన్యత దక్కినట్టు తెలుస్తోంది. మొత్తం 40 మంది సభ్యులతో బీజేపీ రాష్ట్ర కొత్త కమిటీ ఏర్పడింది. ఇందులో 10మంది ఉపాధ్యక్షులు, 10 మంది కార్యదర్శులు, ఐదుగురు ప్రధాన కార్యదర్శులు ఉన్నారు.

బీజేపీ కార్యవర్గంలో ప్రధానంగా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మాజీ మంత్రి రావెల కిశోర్‌‌ బాబు, ఆదినారాయణ రెడ్డి, విష్ణుకుమార్ రాజు, రేలంగి శ్రీదేవి, విజయలక్ష్మీ, మాలతి రాణి, నిమ్మల జయరాజు, వేణుగోపాల్, సురేందర్ రెడ్డి, చంద్రమౌళిలను నియమించారు.

జనరల్‌ సెక్రటరీలుగా వీవీఎన్ మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డి, సూర్యనారాయణ రాజు, మధుకర్, ఎల్ గాంధీలను నియమించారు.

స్పోక్స్‌ పర్సన్‌గా చందు సాంశివరావును నియమిస్తూ సోము వీర్రాజు ఆదివారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు.

మాజీ మంత్రి రావెల కిషోర్ బాబుతోపాటు టీడీపీ నుంచి బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డికి ఈ కమిటీలో స్థానం లభించింది. ఈ కమిటీపై సోము వీర్రాజు తనదైన ముద్ర వేసినట్టు కనిపిస్తోంది. పార్టీ విధేయులకే పెద్ద పీట వేశారు.