Begin typing your search above and press return to search.

మే 20 నుండి ఆంధ్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు?

By:  Tupaki Desk   |   12 May 2021 12:44 PM GMT
మే 20 నుండి ఆంధ్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు?
X
సంవత్సరకాలంగా కరోనా వల్ల ఏపీ బడ్జెట్ సమావేశాలు వాయిదా పడుతూ ఆర్డినెన్స్ ద్వారా ఆమోదించిన బడ్జెప్ పైనే ఏపీ సంసారం నడుస్తోంది. సుదీర్ఘ అంతరం తరువాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మే 20 నుంచి కొన్ని రోజులు జరుగుతాయని అమరావతిలో వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

త్వరలో ఏపీ అసెంబ్లీ నోటిఫికేషన్ జారీ చేస్తారని భావిస్తున్నారు. బడ్జెట్ సెషన్ వాస్తవానికి మార్చి నెలలో జరగాల్సి ఉంది. కానీ మునిసిపాలిటీలు ఎన్నికలు కారణంగా వాయిదా వేయబడింది. తరువాత తిరుపతి లోక్సభ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి.

జగన్ ప్రభుత్వం రోజువారీ ఖర్చుల కోసం కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి నిధులను తీసుకోవటానికి, మూడు నెలల కాలానికి ఓటు-ఆన్-అకౌంట్ బడ్జెట్ ను ఆర్డినెన్స్ ద్వారా ఆమోదించింది. అసెంబ్లీ సెషన్ ఎన్ని రోజులు నిర్వహించాలో సలహా కమిటీ నిర్ణయిస్తుంది. ఇందులోసాధారణ బడ్జెట్‌ను ఆమోదించడం లక్ష్యంగా ఒక చిన్న సెషన్ నిర్వహిస్తారని తెలుస్తోంది.

మొదటి రోజు రాష్ట్ర శాసనసభ మరియు కౌన్సిల్ ఉమ్మడి సమావేశం తప్పనిసరిగా ఉంటుంది. దీనిని గవర్నర్ బిస్వా భూషణ్ హరిచందన్ ప్రసంగిస్తారు. మరుసటి రోజు, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది.

ఇక మరణించిన బాద్వెల్ ఎమ్మెల్యే ఎం వెంకట సుబ్బయ్య, ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డిలకు కూడా అసెంబ్లీ నివాళులు అర్పించనుంది. మరుసటి రోజు, ఆర్థిక మంత్రి బుగ్గనా రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ను సభలో ప్రవేశపెడుతారు. దానిపై రెండు రోజులు చర్చ ఉంటుంది. బడ్జెట్‌ను ఆమోదించడమే కాకుండా, సభలో కొన్ని బిల్లులను ప్రభుత్వం ఆమోదిస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.