Begin typing your search above and press return to search.

పంచ‌క‌ట్టుతో అద‌ర‌గొట్టిన సోమిరెడ్డి

By:  Tupaki Desk   |   8 March 2018 4:07 PM IST
పంచ‌క‌ట్టుతో అద‌ర‌గొట్టిన సోమిరెడ్డి
X
రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ‌టం ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డికి అల‌వాటే. ఎమ్మెల్యేగా గెల‌వ‌కున్నా.. పార్టీ కోసం ఆయ‌న ప‌డే త‌ప‌న‌.. ఆరాటంతో ఎమ్మెల్సీ కోటాలో అవ‌కాశం ఇచ్చారు చంద్ర‌బాబు. అనంత‌రం ఆయ‌న్ను రాష్ట్ర కేబినెట్‌లోకి తీసుకున్నారు.

సాధార‌ణ బ‌డ్జెట్ తో పాటు వ్య‌వ‌సాయ బ‌డ్జెట్ ను వేర్వేరుగా ప్ర‌వేశ పెడుతున్న ఏపీ స‌ర్కారు ఈ సారి అదే సంప్ర‌దాయాన్ని కొన‌సాగింది. ఈ సంద‌ర్భంగా వ్య‌వ‌సాయ మంత్రి సోమిరెడ్డి పంచె.. లాల్చి.. కండువాతో అస‌లుసిస‌లు రైతు వేషంలో అసెంబ్లీకి వ‌చ్చారు. వ్య‌వ‌సాయ బ‌డ్జెట్ ను ఒక రైతు ప్ర‌వేశపెట్టేలా ఆయ‌న త‌యారై వ‌చ్చారు.

వ్య‌వ‌సాయ బ‌డ్జెట్ ను ప్ర‌వేశ పెట్ట‌టానికి సోమిరెడ్డి వ‌చ్చిన తీరును ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అభినందించారు. సోమిరెడ్డి వేష‌ధార‌ణ ఏపీ అధికార‌ప‌క్ష ఎమ్మెల్యేల‌తో పాటు.. మ‌హిళా ఎమ్మెల్యేలు.. మంత్రులు అభినంద‌న‌లు తెలిపారు. అనంత‌రం ఆయ‌న మ‌హిళా ఎమ్మెల్యేల‌తో క‌లిసి ఫోటో దిగారు. ఇక‌.. సోమిరెడ్డి ప్ర‌వేశ పెట్టిన వ్య‌వ‌సాయ బ‌డ్జెట్ లో విశేషాలు చూస్తే..

+ రూ.19.070 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌

+ రెవిన్యూ వ్యయం రూ.18,602 కోట్లు

+ పెట్టుబడి వ్యయం రూ.468.38 కోట్లు

+ వ్యవసాయ అనుబంధ రంగాలకు 4.730 ​కోట్లు

+ సూక్ష్మపోషకాల సవరణకు రూ.60కోట్లు

+ విత్తన రాయితీలు రూ.220కోట్లు

+ పట్టు పరిశ్రమకు రూ.175 కోట్లు

+ మత్స్యశాఖకు రూ.386 కోట్లు

+ కరువు నివారణకు రూ. 1042 కోట్లు

+ వ్యవసాయ మార్కెటింగ్‌ టెక్నాలజీకి రూ. 35 కోట్లు

+ ఎరువు కొరత నివారణకు రూ.45 కోట్లు

+ పశుసంవర్థనశాఖకు రూ.1225 కోట్లు

+ మెగా సీడ్‌పార్క్‌కు రూ.100 కోట్లు

+ పావలా వడ్డి రుణాలకు రూ.5 కోట్లు

+ చంద్రన్న రైతు క్షేత్రాకు రూ.15 కోట్లు

+ ప్రధాన ఫసల్‌ బీమా యోజన రూ.485 కోట్లు

+ రైతులకు వడ్డీలేని రుణాలకు రూ.172 కోట్లు

+ వ్యవసాయ యాంత్రికరణకు రూ.258 కోట్లు

ఏపీ ఏమేం సాధించిందంటే..

= మొక్కజొన్న ఉత్పత్తి లో దేశంలో ఏపీ రెండో స్థానం

= వరి ఉత్పత్తిలో దేశంలో మూడో స్థానంలో ఏపీ

= రసాయన ఎరువుల వాడకంలో దేశంలో ఆరో స్థానం

= రైతులకు 100శాతం రాయితీతో సూక్ష్మపోషకాల పంపీణి

= నాణ్యమైన విత్తనాల సరఫరా కోసం ఆధార్‌ అనుసంధానం

= రైతులకు సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు అగ్రిటెక్ ఏర్పాటు

= బత్తాయి ఉత్పతిలో ద్వితియ స్థానం

= వేరుశనగ విత్తనాలకు 90 శాతం రాయితీ

రుణ‌మాఫీ

రుణమాఫీ కోసం​ 4,100 కోట్లు