Begin typing your search above and press return to search.
సుమను కేటీఆర్ అండ్ కో ఎందుకు సెలెక్ట్ చేసినట్లు?
By: Tupaki Desk | 22 Nov 2020 10:30 AM ISTఏ చిన్న అవకాశాన్ని విడవకూడదన్నట్లుగా ఉంది టీఆర్ఎస్ నాయకత్వ తీరు. గ్రేటర్ ఎన్నికల్లో తాము అనుకున్నట్లు వందకు పైగా డివిజన్లను సొంతం చేసుకోవటానికి అవసరమైన అన్ని వ్యూహాల్ని అమల్లోకి తీసుకొస్తున్నారు. హార్డ్ వర్క్ చేస్తూనే.. అక్కడితో ఆగకుండా స్మార్ట్ వర్కు చేస్తున్న కేటీఆర్ తీరు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. అంతా తానై వ్యవహరిస్తూనే.. పార్టీకి చెందిన అందరిని గ్రేటర్ ఎన్నికల్లో ఇన్ వాల్వ్ చేయిస్తున్న తీరు చూస్తే.. భావి నాయకుడికి కోసం పార్టీ యావత్తు అహరహం శ్రమిస్తోందని చెప్పాలి.
తాజాగా కేటీఆర్ ను ప్రముఖ యాంకర్ సుమ ఇంటర్వ్యూ చేసిన వైనం ఇన్ స్టాలో ఆమె పోస్టు చేసిన పోస్టు చూస్తే అర్థమవుతుంది. ఒక రాజకీయనేత.. అందునా అధికారపార్టీలో అత్యంత కీలకమైన నేత.. భావి సీఎంగా అభివర్ణించే కేటీఆర్.. తన ఇంటర్వ్యూను సుమకు ఎందుకు ఇచ్చారు? ఆ మాట కంటే కూడా.. సుమను తన ఇంటర్వ్యూను ప్రమోట్ చేయటానికి అవకాశం కల్పించారు? అంటే సమంజసంగా ఉంటుందేమో?
తరచూ తన షోలో హుషారుగా ఉంటే సుమ.. తాజా ఇంటర్వ్యూలో మాత్రం.. స్కూల్లో స్టూడెంట్ మాదిరి చాలా బుద్ధిగా ఉన్న వైనం చూస్తే.. ఈ ఇంటర్వ్యూ ఎలా ఉంటుందన్న విషయం ఇట్టే అర్థమైపోతుంది. తమ ప్రభుత్వ పాలన గురించి ప్రచారం చేసుకోవటానికి వీలుగా తాజా ఇంటర్వ్యూను ఇచ్చినట్లుగా కనిపించక మానదు. ఇంతకూ.. తనను ఇంటర్వ్యూ చేయటానికి సుమను మంత్రి కేటీఆర్ ఎందుకు ఎంపిక చేసుకున్నట్లు? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే ఆసక్తికర విషయాల్ని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నారు.
ప్రతి ఇంటికి సుపరిచితమైన సుమతో ఇంటర్వ్యూ చేస్తే.. ఇట్టే కనెక్టు అవుతుందన్న ఉద్దేశమే ప్రధాన కారణమని చెబుతున్నారు. మామూలుగా అయితే.. ఏ పొలిటికల్ జర్నలిస్టు కానీ.. ప్రధాన మీడియాకు సంబంధించిన వ్యక్తి చేత ఇంటర్వ్యూ చేస్తే.. ప్రశ్నలు వేరేగా ఉంటాయి. అందుకు భిన్నంగా తాము ఇచ్చిన ప్రశ్నల్ని సంధిస్తూ.. తమకు అనువైన సందేశాన్ని ఇచ్చేందుకు వీలుగా ఏ యాంకర్ అయితే బాగుంటుందన్న వాకబు భారీగా చేసింది గులాబీ దళం. అక్కడి వారందరి ఓటు సుమకు వేయటంతో ఆమెకు అవకాశం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మిగిలిన వారి కంటే కూడా.. సుమతో ఇంటర్వ్యూ అయితే.. ఒకింత ఆసక్తి వ్యక్తం అవుతుందన్న ఉద్దేశంతో ఆమెను ఎంపిక చేసుకున్నట్లుగా చెబుతున్నారు.