Begin typing your search above and press return to search.

'ముఖ్య' నేత‌ల‌కు గొప్ప స‌మ‌స్య‌

By:  Tupaki Desk   |   21 April 2016 3:35 PM GMT
ముఖ్య నేత‌ల‌కు గొప్ప స‌మ‌స్య‌
X
రాజ‌కీయాల్లో డైన‌మిజం ఎంత ముఖ్య‌మో స‌మ‌య స్పూర్తిగా స్పందించ‌డం కూడ అంతే ముఖ్యం. పైగా ఎన్నిక‌ల స‌మ‌యంలో వాగ్భాణాలు సందించాలంటే టైమింగ్‌ - రైమింగ్ తెలిసి ఉండాలి. అలా ప‌ట్టు సాధించిన వ్య‌క్తి త‌మిళ రాజ‌కీయ నాయ‌కుడు అన్భుమ‌ణి రాందాస్‌. ప‌ట్టాల్ మ‌క్క‌ల్ క‌చ్చి(పీఎంకే) సీఎం అభ్య‌ర్థిగా బ‌రిలో ఉన్న ఆయ‌న త‌మిళ‌నాడు రాజ‌కీయాల‌ను మూడు ముక్క‌ల్లో తేల్చేశారు.

త‌మిళ‌నాడులో ప్ర‌స్తుత సీఎం - అన్నాడీఎంకే అధినేత్రి జ‌య‌ల‌లిత‌ - డీఎంకే అధినేత క‌రుణానిధి - సినీ న‌టుడు - డీఎండీకే అధినేత విజ‌య్‌ కాంత్ గురించి విశ్లేషించ‌డ‌మే కాకుండా తాను సీఎం అయితే ఏం చేస్తానో చెప్పుకొచ్చారు. త‌మిళ‌నాడు సీఎం అభ్యర్థులుగా రంగంలో ఉన్న మిగ‌తా ముగ్గురు నాయ‌కులు త‌మ ప‌నులు తామే చేసుకోలేని వార‌ని రాందాస్‌ ఎద్దేవా చేశారు. ఆరోగ్య కారణాలతో జయలలిత ఇంటికే పరిమితమవ‌డాన్ని ప్ర‌స్తావిస్తూ గత ఐదేళ్ల కాలంలో సీఎం తన ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టలేదని ఎద్దేవా చేశారు. ఇక 93 వృద్ధ నేత‌ - మాజీ సీఎం క‌రుణానిధి గురించి ప్ర‌స్తావిస్తూ ఆయన రాజ‌కీయాల‌కు టాటా చెప్తే మంచిద‌ని చెప్ప‌డాన్ని గుర్తుచేశారు. విజయ్‌ కాంత్ గురించి ప్ర‌స్తావిస్తూ ఆయన ప్రజలు చెప్పేది వినడ‌ని అంతే కాకుండా ఆయన చెప్పేది ప్ర‌జ‌ల‌కు అర్థం కాదని సెటైర్లు పేల్చారు. వీళ్లంద‌రి గురించి ప్ర‌స్తావిస్తూ.... తాను ఉత్త‌మ సీఎంగా నిరూపించుకుంటాన‌ని రాందాస్ తెలిపారు. గ‌తంలో కేంద్ర మంత్రిగా తన ప‌నితీరే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని వివ‌రించారు. ఈ ఎన్నిక‌ల్లో త‌న‌ను గెలిపించాల‌ని అభ్య‌ర్థించారు.