Begin typing your search above and press return to search.
తెలంగాణ అడవి బిడ్డలపై ఆరాచకం.. బూట్లతో తన్ని.. మర్మాంగాల్ని గాయపర్చారు!
By: Tupaki Desk | 28 March 2021 1:00 PM ISTఅడవినే నమ్ముకున్న గిరిజనంపై అటవీ శాఖ అధికారుల్లో కొందరు రెచ్చిపోతుంటారు. గిరిజనుల తప్పు లేకున్నా.. వారిపై దాష్టీకం ప్రదర్శిస్తుంటారు. దారుణంగా హింసిస్తూ అవమానిస్తుంటారు. తాజాగా అలాంటి ఉదంతమే తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలంలో చోటు చేసుకుంది. ఇంతకీ వారు చేసిన తప్పు ఏమిటో తెలుసా? తమ సంప్రదాయంలో భాగంగా ఇష్టదేవతలకు నైవేద్యం సమర్పించి.. అడవిలోనే నిద్రపోవటం.
హోలీసందర్భంగా తమ ఇష్ట దేవతలకు నైవేద్యం సమర్పించి.. ఇప్పపూల సేకరణ కోసం బండలచెలిమి ప్రాంతంలో వారంతా నిద్రపోయారు. అర్థరాత్రి వేళ అటవీ సిబ్బంది మెరుపుదాడి నిర్వహించారు. ఆడ.. మగ..చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా బూటుకాళ్లతో తన్ని తీవ్రంగా గాయపర్చారు. స్త్రీ.. పురుష మర్మాంగాలను గాయపరిచిన అటవీ శాఖ సిబ్బంది తమ రాక్షసత్వాన్ని ప్రదర్శించారు.
తమ వారిపై దాడి జరిగిన విషయాన్ని తెలుసుకున్న గిరిజనులు.. వారి సంక్షేమం కోసం పోరాడే సంఘాలు.. వివిధ పార్టీల నేతలు శ్రీశైలం ప్రధాన రహదారిని దిగ్బంధించటంతో పాటు అధికారులపై తిరగబడ్డారు. ఇదిలా ఉండగా.. అధికారుల దాడిలో గాయపడిపన బాధితుల్నిప్రభుత్వ చీఫ్ విప్ గువ్వల బాలరాజు.. కలెక్టర్ శర్మన్ పరామర్శించారు. అధికార జులుం ప్రదర్శించిన అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జరిగిన ఉదంతంపై విచారణ జరిపి.. బాధితులపై చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు చెబుతున్నారు.