Begin typing your search above and press return to search.

డ్రగ్స్ కేసులో ఆ హీరోయిన్ దే కీరోల్?

By:  Tupaki Desk   |   25 Oct 2021 4:22 AM GMT
డ్రగ్స్ కేసులో ఆ హీరోయిన్ దే కీరోల్?
X
బాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేస్తున్న క్రూయిజ్ నౌకపై డ్రగ్స్ కేసు వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో తాజాగా ప్రముఖ నటుడు చుంకీ పాండే కుమార్తె, బాలీవుడ్ నటి అనన్య పాండే పేరు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే.

బాలీవుడ్ ను షేక్ చేస్తున్న ఇష్యూ డ్రగ్స్ కేసు. ఈ కేసులో ఇప్పటికే బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయ్యి బెయిల్ దొరక్క జైల్లోనే మగ్గుతున్నాడు. అతడితో డ్రగ్స్ చాట్ చేసిన పాపానికి ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ బుక్కైంది. ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండేను ప్రస్తుతం ఎన్సీబీ విచారిస్తోంది.

అయితే అసలు ఆర్యన్ ఖాన్ కు డ్రగ్స్ ను పరిచయం చేసింది ఎవరు? అన్న దానిపై విచారణ మొదలైంది. ఆ విచారణలో ప్రముఖంగా వినిపించిన పేరు హీరోయిన్ అనన్య పాండే. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని అనన్య పాండే వివరణ ఇచ్చినా అది నమ్మశక్యంగా లేదు. దాంతో ఆమెపై మరింతగా నిఘా పెట్టారు అధికారులు.. పైగా అనన్యపాండేను పిలిపించి ఎన్సీబీ అధికారులు లోతుగా విచారించారు. విచారణ సమయంలో ఆర్యన్ ఖాన్ తో డ్రగ్స్ చాట్ గురించి అధికారులు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే తాను ఆర్యన్ తో డ్రగ్స్ విషయంలో జోక్ చేశానని అనన్య చెప్పినట్లు సమాచారం.

ఆర్యన్ తో అనన్యపాండే వాట్సాప్ చాట్ గురించి ఎన్సీబీ ఆరాతీశారు.వీరిద్దరి మధ్య గంజాయి కోసం వాట్సాప్ చర్చ జరిగిందని ఎన్.సీబీ అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. గంజాయి కోసం ఆర్యన్ అడగ్గా.. ఏర్పాటు చేస్తానని అనన్య చెప్పినట్లు ఆ చాట్ ఉందని సమాచారం. ఈ చాట్ ను చూపించి అధికారులు ప్రశ్నించగా.. తాను కేవలం జోక్ చేశానని అనన్య చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. తాను ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని..ఎవరికి సరఫరా చేయలేదని ఆమె చెప్పినట్లు తెలిసింది. అయితే ఆర్యన్ కోసం ఆనన్య డ్రగ్స్ పంపించినట్టు ఎలాంటి సాక్ష్యాలు లభించలేదని తెలుస్తోంది.ఇక ఎన్సీబీ విచారణ సమయంలో అనన్య కన్నీళ్లు పెట్టుకుందని ఆందోళనకు గురైందని వార్తలు వచ్చాయి.

ఎంతగా అడిగినా అనన్య మాత్రం ఒకే రకం సమాధానాలు చెబుతోందని సమాచారం. తన జీవితంలో ఎన్నడూ డ్రగ్స్ తీసుకోలేదని చెప్పిన అనన్య మరి డ్రగ్స్ డీలర్స్ తో ఎందుకు చాట్ చేసిందనే దానిపై ఆరాతీస్తున్నారు. అలాగే షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు డ్రగ్స్ డీలర్స్ నెంబర్లు ఎలా ఇచ్చింది? లాంటి విషయాలపై ఆమె మౌనవ్రతం పాటించిందట.. మొత్తానికి ఈ డ్రగ్స్ కేసులో తెలిసి తెలియకుండా అనన్య ముఖ్యపాత్ర పోషించినట్టుగా తెలుస్తోంది.