Begin typing your search above and press return to search.

అనంత‌లో జ‌గ‌న్ పార్టీ నేత దారుణ హ‌త్య‌

By:  Tupaki Desk   |   6 Dec 2017 8:26 AM GMT
అనంత‌లో జ‌గ‌న్ పార్టీ నేత దారుణ హ‌త్య‌
X
ఏపీ రాష్ట్రంలో దారుణ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. విప‌క్షానికి చెందిన పార్టీ నేత‌ల ప్రాణాల్ని తీస్తున్నారు. చంద్ర‌బాబు స‌ర్కారు కొలువు తీరిన త‌ర్వాత నుంచి గ్రామాల్లో హ‌త్యా రాజ‌కీయాలు అంత‌కంత‌కూ పెరిగిపోతున్నాయి. ఓవైపు ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అనంత‌పురం జిల్లాలో ప‌ర్య‌టిస్తున్న వేళ‌లో.. పార్టీలో కీల‌క‌నేత‌గా పేరున్న ఒక నాయ‌కుడ్ని దారుణంగా హ‌త్య చేయ‌టం సంచ‌ల‌నంగా మారింది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తూ.. అనంత‌పురం జిల్లాలో గుర్తింపు పొందిన నేత చెన్నారెడ్డి. తాజాగా గుర్తు తెలియ‌ని కొంద‌రు దుండ‌గులు ప‌థ‌కం ప్ర‌కారం దారుణంగా హత్య చేశారు. జ‌గ‌న్ పార్టీ ఆవిర్భావం నంచి క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న చెన్నారెడ్డిని గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఈ రోజు ప‌థ‌కం ప్రకారం వేట‌కొడ‌వ‌ళ్ల‌తో దారుణంగా హ‌త్య చేశారు.

బ‌డ‌న‌ప‌ల్లి కి చెందిన చెన్నారెడ్డి ఈ రోజు (బుధ‌వారం) బ‌డ‌న‌ప‌ల్లి స‌మీపంలోని పంట‌పొలాల వ‌ద్ద ప‌నుల్ని ప‌ర్య‌వేక్షిస్తుండ‌గా.. కొంద‌రు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు వేట‌కొడ‌వ‌ళ్ల‌తో దాడి చేసి హ‌త్య చేశారు. దీంతో ఆయ‌న కుటుంబ స‌భ్యులు.. పార్టీ నేత‌లు తీవ్ర శోకంలో మునిగిపోయారు. ఇటీవ‌ల కాలంలో ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత‌లు హ‌త్య‌ల‌కు గురి అవుతున్నా.. బాబు స‌ర్కారు ప‌ట్టించుకోవ‌టం లేద‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.