Begin typing your search above and press return to search.
దమ్ముంటే టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు!
By: Tupaki Desk | 31 Dec 2019 5:55 PM ISTప్రస్తుతం ఏపీ మొత్తం మూడు రాజధానుల వ్యవహారం పై గరం గరంగా ఉంది. అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితం కారాదని, వికేంద్రీకరణ జరగాలనే లక్ష్యంతో ఏపీకి మూడు రాజధానులు అవసరముందని సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటనతో ఒక్కసారిగా అమరావతి ప్రాంతాల్లో ఆందోళనలు మొదలైయ్యాయి. అమరావతి లో ఆందోళన చేస్తున్న వారికీ టీడీపీ మద్దతు ప్రకటించి ప్రభుత్వం పై పోరాటం చేస్తుంది. రాజధానిని తరలిస్తే ఊరుకోమని , కచ్చితంగా అమరావతినే ఏపీ రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే , మూడు రాజధానులపై రాష్ట్ర ప్రజానీకం హర్షం వ్యక్తం చేసి - సీఎం తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే ..టీడీపీ మాత్రం అనవసరంగా రాద్దాంతం చేస్తుంది వైసీపీ నేతలు ..టీడీపీ నేతలపై విరుచుకుపడుతున్నారు. మూడు రాజధానుల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి దమ్మూ ధైర్యం ఉంటే తన పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి.. మళ్లీ ప్రజాతీర్పు కోరాలని వైఎస్సార్ సీపీ అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి సవాల్ చేశారు.
రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటును ప్రజలు స్వాగతిస్తున్నారని, కానీ చంద్రబాబు - టీడీపీ నేతలు మాత్రమే దీనిని వ్యతిరేకిస్తూ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందటం చంద్రబాబుకు ఇష్టం లేనట్లుందని ఆయన విమర్శించారు. కాగా ముఖ్యమంత్రి జగన్ మాత్రం రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తారని వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు సైంధవుడిలా అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు.