Begin typing your search above and press return to search.
తెలంగాణ యువకుడికి ఆనందయ్య మందు.. వీడియో చూస్తే నోట మాట రాదంతే
By: Tupaki Desk | 26 May 2021 9:33 AM ISTఎక్కడ తెలంగాణ..? మరెక్కడ నెల్లూరు జిల్లా క్రిష్ణపట్నం. కరోనాతో తీవ్ర ఇబ్బందులకు గురవుతూ.. ఎంతకూ తగ్గని జబ్బు.. అంతకు మించి అవుతున్న ఖర్చును భరించలేక.. నెల్లూరు జిల్లా క్రిష్ణపట్నం ఆనందయ్య మందు గురించి తెలుసుకున్న ఒక తెలంగాణ కుర్రాడు తల్లితో సహా ఆనందయ్య ఊరికి వెళ్లాడు. అక్కడ చెట్టు కింద నీరసంగా పడి ఉన్న ఆ వ్యక్తికి కంట్లో పసరు.. నోట్లో మందు వేశారు. కట్ చేస్తే.. నిమిషాల వ్యవధిలో ఆ యువకుడు లేచి కూర్చోవటమే కాదు.. కాళ్లు.. చేతులు విదల్చటం.. నిలుచోవటమే కాదు.. బస్కీలు తీసేందుకు అవసరమైన ఉత్సాహాం తనకు వచ్చినట్లుగా వీడియోలో ఉంది.
తమది తెలంగాణ అని.. ఆనందయ్య వైద్యం గురించి విని వచ్చమని.. నిమిషాల వ్యవధిలో తన ఒంట్లో మార్పు వచ్చినట్లుగా ఆ యువకుడితో పేర్కొన్నాడు. నాలుగు నిమిషాలకుపైనే నిడివి ఉన్న ఈ వీడియోలో.. సదరు యువకుడికి దగ్గర్లోనే టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు. ఆనందయ్య మందును ప్రభుత్వం వెంటనే పంపిణీ చేయాలని కోరారు. మిగిలిన రాజకీయ అంశాల్ని కాసేపు పక్కన పెట్టేస్తే.. వీడియోలో ఏ మాత్రం సత్తువ లేకుండా నిస్సత్తువుగా చెట్టు కింద.. నేల మీద పడుకున్న యువకుడు.. మందు వేసుకున్న కాసేపటికే యాక్టివ్ కావటం.. మాట్లాడలేనంత నీరసంగా ఉన్న వాడు.. ఆనందయ్య మందు గురించి.. దాన్ని వేసుకున్నంతనే తనకొచ్చిన మార్పు గురించి చెప్పిన వైనం ఇప్పుడు వైరల్ గా మారింది.
ఈ వీడియోను.. ఈ వార్తను కేవలం ఆనందయ్య మందు మీద విపరీతమైన ఆసక్తి వ్యక్తమవుతున్న వేళ.. పోస్టు చేస్తున్నాం. ఈ మందును మేం సమర్థించటం లేదు.. వ్యతిరేకించటం లేదన్నది మరోసారి విన్నవించుకుంటున్నాం. ప్రస్తుతం ఈ మందుపై రెండు రకాల చర్చ జోరుగా సాగుతున్న వేళ.. జరుగుతున్న పరిణామాల్ని చూపించటం.. ప్రజలకు చేరవేయటం మా బాధ్యతగా భావిస్తున్నాం. అందులో భాగంగానే ఈ వీడియోను పోస్టు చేస్తున్నామన్న విషయాన్ని గుర్తించగలరు. ప్రస్తుతం ఈ మందుపై పలువురు అధికారులు శాస్త్రీయత ఎంతన్న అంశంపై పరిశోధనలు చేస్తున్నరన్నది తెలిసిందే. అధికారులు మరేం తేలుస్తారో చూడాలి.