Begin typing your search above and press return to search.

వాలంటీర్ల ద్వారా ఆనందయ్య మందు ఇంటింటికి పంపిణీ !

By:  Tupaki Desk   |   8 Jun 2021 7:30 AM GMT
వాలంటీర్ల ద్వారా ఆనందయ్య మందు ఇంటింటికి పంపిణీ !
X
ఈ రోజు నుండి ఆనందయ్య కరోనా ఆయుర్వేద మందును ఇంటింటికి పంపిణీ చేయనున్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో నేడు పంపిణీ చేయనున్నారు. మనుబోలు, పొదలకూరు మండలాల్లో గ్రామ వలంటీర్ల సహాయంతో ఆనందయ్య మందును పంపిణీ చేయించనున్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని లక్ష ఎనభై వేల ఇళ్లకు ఆనందయ్య మందు చేరనుంది. కృష్ణపట్నంలో ఆనందయ్య మందు పంపిణీ జరగడం లేదు. కృష్ణపట్నంకి ఎంత దూరం నుంచి వచ్చిన మందు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. ప్రస్తుతం కృష్ణపట్నంలో 144 సెక్షన్ కొనసాగుతుంది. కృష్ణపట్నం లో కి ఇతర ప్రాంతాల వారిని అనుమతించడం లేదు. ఆధార్ కార్డు ఉంటేనే కృష్ణపట్నంలోకి అనుమతిస్తున్నారు పోలీసులు.

అయితే, కడపలో ఆనందయ్య మందు తయారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. స్విస్ట్ ఇంజినీరింగ్ కళాశాలలో ఆనందయ్య మందును తయారీ చేయనున్నారు. తాజాగా ఆనందయ్య కె మందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో ఆనందయ్య కె మందును ప్రభుత్వం నిలుపుదల చేసింది. దానిపై విచారాంచిన హైకోర్టు.. వెంటనే కరోనా బాధితులకు కె మందును పంపిణీ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కానీ ఆనందయ్య మందుల్లో కీలకమైందిగా భావిస్తున్న కంటి చుక్కల మందుకు సంబంధించి రెండు వారాల్లో నివేదిక అందించాలని ధర్మాసనం సూచించింది. తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 21కి వాయిదా వేసింది. గతంలో ఆనందయ్య ఇతర మందులకు అనుమతిచ్చిన ప్రభుత్వం. కంట్లో వేసే చుక్కల మందు సహా కె మందుకు అనుమతి ఇవ్వలేదు. ఆయుష్ నివేదికకు సంబంధించి పూర్తి వివరాలు రాని నేపథ్యంలో వీటికి అనుమతి లభించలేదు. దీంతో ఆనందయ్య కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన ధర్మాసనం, కరోనా బాధితులకు తక్షణమే కె మందు పంపిణీ చేయాలని స్పష్టం చేసింది. గతంలోనే ఆనందయ్య ఇచ్చే పి, ఎల్, ఎఫ్‌ మందులకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సీసీఆర్‌ఏఎస్‌ నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాటి పంపిణీని ఇప్పటికే ప్రారంభించారు ఆనందయ్య. ఇప్పుడు తాజాగా కె మందుకు కూడా హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆ మందు పంపిణీ పై ఆనందయ్య ఫోకస్ చేస్తున్నారు.