Begin typing your search above and press return to search.

బిజినెస్ టైకూన్ కంటతడి పెట్టేలా చేసిన చిన్నారి

By:  Tupaki Desk   |   21 Sep 2019 2:30 PM GMT
బిజినెస్ టైకూన్ కంటతడి పెట్టేలా చేసిన చిన్నారి
X
దేశంలో చాలామంది పారిశ్రామికవేత్తలు ఉండొచ్చు. కానీ.. వారందరిలో కొందరు కాస్త భిన్నంగా ఉంటారు. ఇండస్ట్రీ వర్గాల్లో..పొలిటికల్ సర్కిల్స్ లో మాత్రమే వారికి ఉండే పేరు ప్రఖ్యాతులు సామాన్యుల్లో ఉండదు. దీనికి మినహాయింపుగా చాలాకొద్దిమంది మాత్రమే ఉంటారు. అలాంటి వారు..సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారెంతమంది? అంటే వెంటనే చెప్పే సమాధానం ఆనంద్ మహీంద్ర.

అందరిని ఆకట్టుకునే అంశాలతో పాటు.. యాక్టివ్ గా ఉండటం.. కరెంట్ టాపిక్స్ మీద తరచూ స్పందించటమే కాదు.. స్ఫూర్తివంతమైన పోస్టులు పెట్టే విషయంలో ఆనంద్ మహీంద్ర ముందుంటారు. తాజాగా ఆయన పెట్టిన పోస్టు ఆకట్టుకోవటమే కాదు.. వైరల్ గా మారింది. పలువురి చేత కంటతడి పెట్టేలా చేస్తోంది. తాను సైతం ఆ వీడియోను చూసినంతనే కంటతడి పెట్టుకున్నట్లు బిజినెస్ టైకూన్ ఆనంద్ మహీంద్ర వెల్లడించారు.

ఇంతకీ ఆ వీడియో ఏమంటే.. సరిగ్గా మూడేళ్లు కూడా ఉంటాయో ఉండవో కానీ.. పుట్టుకతోనే చేతులు లేని ఆ పాప.. కాళ్లతో ఆహారం తినే ప్రయత్నం చేస్తుంటుంది. మొదటి ప్రయత్నంలో ఫెయిల్ అయినప్పటికీ.. రెండో ప్రయత్నంలో సక్సెస్ అవుతుంది. చేతులు లేకున్నా.. తాను ఎందులోనూ తక్కువ కాదన్నట్లుగా కాళ్లతో చిన్నారి పనులు చేసుకోవటాన్ని చూసి తాను కన్నీళ్లు ఆపుకోలేకపోయినట్లు మహీంద్ర తన తాజా ట్వీట్ లో పేర్కొన్నారు.

తానీ మధ్యనే తన మనమడ్ని చూసొచ్చానని.. అందుకే తానీ వీడియో చూసిన వెంటనే కన్నీళ్లు ఆపుకోలేనట్లు చెప్పారు. ఎలాంటి లోపాలు.. సవాళ్లు ఉన్నా సరే.. జీవితం మనకో బహుమతి అని.. దాన్ని అందంగా తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత మనదేనని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి వీడియోలు చూసినప్పుడు తనలో ఆత్మవిశ్వాసం.. పాజిటివ్ నెస్ మరింత పెరుగుతుందని ఆయన చెప్పారు. ఆయనకే కాదు.. ఎవరినైనా ఈ చిన్నారి వీడియో మార్చేస్తుందని చెప్పక తప్పదు.

వీడియో కోసం క్లిక్ చేయండి