Begin typing your search above and press return to search.

బామ్మ వీడియో పోస్ట్ చేసిన స్టార్టప్ లకు కొత్త అర్థం చెప్పిన ఆనంద్ మహీంద్రా

By:  Tupaki Desk   |   8 Jan 2020 4:18 AM GMT
బామ్మ వీడియో పోస్ట్ చేసిన స్టార్టప్ లకు కొత్త అర్థం చెప్పిన ఆనంద్ మహీంద్రా
X
దేశంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త ట్యాగ్ చాలామందికి ఉండొచ్చు. కానీ.. ఆనంద్ మహీంద్రా మాత్రం ప్రత్యేకం. మిగిలిన వారికి భిన్నంగా ఆయన సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికి తెలిసిన విషయమే. వివిధ అంశాల మీదా.. పలు సందర్భాల్లో స్పందించే ఆయన.. ఆసక్తికరమైన కొన్ని వీడియోల్ని పోస్టు చేస్తుంటారు. తాజాగా ఆయన అలాంటి వీడియో ఒకదాన్ని పోస్టు చేశారు. తన స్థాయి లో తనకు తెలిసిన విషయాల్ని పోస్టు చేసే ఆయన.. తరచూ హాట్ టాపిక్ అవుతుంటారు.
ఆ మధ్యన రూపాయికి ఇడ్లీ అమ్మే బామ్మను పరిచయం చేసిన ఆయన.. తాజాగా ఛండీగఢ్ కు చెందిన మరో బామ్మను తాజా వీడియోను పోస్టు చేసి పరిచయం చేశారు. 94 ఏళ్ల వయసులో సదరు బామ్మ చేస్తున్న పని.. వయసులతో సంబంధం లేకుండా స్ఫూర్తిని రగిలిస్తుందని చెప్పక తప్పదు. ఇంతకీ ఆయన పోస్టు చేసిన బామ్మ స్పెషల్ ఏమంటే..

94 ఏళ్ల హర్భజన్ కౌన్ అనే ఛండీగఢ్ మహిళకు నాలుగేళ్ల క్రితం సొంతంగా డబ్బు సంపాదించాలని భావించారు. అంతే.. బేసిన్ కీ బర్ఫీ పేరుతో ఆమె స్వయంగా స్వీట్లు తయారు చేస్తూ.. అమ్మటం మొదలు పెట్టారట. ఆమెకు సంబంధించిన వీడియోను మధు టేక్ చందానీ అనే డాక్టర్ ట్విట్టర్ లో పోస్టు చేస్తే.. దాన్ని ఆనంద్ మహీంద్రా ట్యాగ్ చేశారు. ఈ సందర్భంగా సదరు బామ్మకు సంబంధించి ఆసక్తికరంగా రియాక్ట్ అయ్యారు.

మనలో చాలామందికి స్టార్టప్ లు అన్నంతనే సిలికాన్ వ్యాలీ..బెంగళూరులో మిలియన్ డాలర్లు ఎలా సంపాదించాలనే మిలినియల్స్ గుర్తుకొస్తారని.. కానీ.. ఇప్పటి నుంచి ఈ లిస్టులో 94 ఏళ్ల బామ్మను కూడా చేరుద్దామన్నారు. ఈ వయసులో స్టార్టప్ ను స్టార్ట్ చేద్దామన్న ఆమె ఆలోచనల్ని అభినంధించిన ఆయన.. ఈ ఏడాది ఎంట్రపెన్యూర్ ఆమేనంటూ పొగడ్తల వర్షం కురిపించారు. ఈ వీడియోను చూసిన వారు పెద్ద సంఖ్యలో పాజిటివ్ గా స్పందించటమే కాదు.. అన్ని వయసుల వారు తప్పనిసరిగా చూడాల్సిన వీడియోగా పేర్కొనటం గమనార్హం. మరి.. మీరూ ఒక లుక్ వేయండి.