Begin typing your search above and press return to search.

అదిరేలా ఆనంద్ మహీంద్రా చురక.. స్టార్లు.. సూపర్ స్టార్లు కాదు.. అది ముఖ్యం!

By:  Tupaki Desk   |   13 Sep 2022 4:22 AM GMT
అదిరేలా ఆనంద్ మహీంద్రా చురక.. స్టార్లు.. సూపర్ స్టార్లు కాదు.. అది ముఖ్యం!
X
ఆసక్తికర విషయాల్ని పంచుకోవటం.. స్ఫూర్తివంతమైన వారిని పరిచయం చేయటం.. వీలైనంత వరకు వివాదాలకు దూరంగా.. పాజిటివ్ కు దగ్గరగా వ్యవహరించే వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆయన.. సమకాలీన పరిస్థితుల మీదా.. పరిణామాల మీదా తరచూ స్పందించే ఆయన తాజాగా చేసిన ట్వీట్ ఒకటి ఆసక్తికరంగా మారటమే కాదు.. చాలా రోజుల తర్వాత ఆయన నుంచి ఒక చురక పడిందని చెప్పాలి. తాజాగా ముగిసిన ఆసియా కప్ 2022లో విజేతగా నిలిచిన శ్రీలంక జట్టును ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్య చేశారు.

ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి.. భారత్.. పాకిస్థాన్ లాంటి ప్రపంచ స్థాయి జట్లకు షాకిచ్చి.. టైటిల్ ఎత్తుకెళ్లిన లంకేయుల్ని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్య చూసినప్పుడు టీమిండియాకు సరైన టైంలో పడిన సరైన పంచ్ గా చెప్పాలి. ఫైనల్ మ్యాచ్ లో పాక్ జట్టను శ్రీలంక మట్టికరిపించిన వైనం థ్రిల్లింగ్ గా ఉందన్న ఆయన.. పర్ ఫెక్టు పంచ్ వేశారు.

దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ ఫైనల్ లో శ్రీలంక 23 పరుగుల తేడాలో ఓడించటం తెలిసిందే.తొలిసారి ఆసియా ఛాంపియన్ గా అవతరించింది. టాస్ ఓడిన శ్రీలంక జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 6 వికెట్లకు 170 పరుగులు చేసింది. 58 పరుగులకే సగం వికెట్లు కోల్పోయినా భానుక రాజపక్ష (71 పరుగులు నాటౌట్).. హసరంగ (36 పరుగులు) చేసి జట్టను ఆదుకున్నారు.

పాక్ గెలుపును లంక బౌలర్లు ప్రమోద్ మధుశన్ (4 వికెట్లు).. హసరంగ (3 వికెట్లు).. చమిక కరుణరత్నే (2 వికెట్లు) చెలరేగిపోవటంతో 147 పరుగలకే కుప్పకూలిన విషయం తెలిసిందే.

ఇదే విషయాన్ని తనదైన మాటల్లో చెప్పిన ఆనంద్ మహీంద్రా.. ''క్రికెట్ లాంటి టీమ్ గేమ్ లో జట్టు గెలవాలంటే సెలబ్రిటీలు.. సూపర్ స్టార్లు.. స్టార్లు అవసరం లేదు. ఆ విషయాన్ని లంకేయులు నిరూపించారు' అని వ్యాఖ్యానించారు.

న టీమ్ వర్కు ఉంటే ఎంత చిన్న జట్టైనా అద్భుతాలు చేయగలదని మరోసారి రుజువైందన్న ఆయన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. టీమిండియాలో మిస్ అయిన పాయింట్ ను ఆయన తన ట్వీట్ తో సూటిగా చెప్పేశారని చెప్పాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.